Bunny Vasu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యువ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బన్నీ వాసు(Bunny Vasu) ఒకరు. ఈయన గీత ఆర్ట్స్ 2 బ్యానర్ వ్యవహారాలను చూసుకుంటూ ఈ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇలా అల్లు అరవింద్(Allu Aravind) గారి వద్ద ఉంటూ నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న బన్నీ వాసు త్వరలోనే సరికొత్త ప్రొడక్షన్ ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఈయన ఇప్పటికే బీ.వి వర్క్స్ పేరిట ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు . త్వరలోనే ఈ నిర్మాణ సంస్థ నుంచి సరికొత్త అప్డేట్స్ రాబోతున్నాయని ప్రకటించారు. ఇలా కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించడంతో ఈయన గీత ఆర్ట్స్ నుంచి బయటకు వస్తున్నారని అందరూ భావించారు.
అల్లు అరవింద్ గాడ్ ఫాదర్…
అల్లు అరవింద్ గారితో గొడవలు జరుగుతున్నాయని అందుకే గీత ఆర్ట్స్(Geetha Arts) నుంచి బయటకు వస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో బన్నీ వాసు ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ తాను గీత ఆర్ట్స్ లోనే కొనసాగుతున్నానని తెలిపారు. ఇకపోతే అల్లు అరవింద్ గారితో తనకు ఎంతో మంచి బాండింగ్ ఉందని, నేను మా నాన్నతో గడిపిన క్షణాల కంటే కూడా అల్లు అరవింద్ గారితో గడిపిన క్షణాలే ఎక్కువగా ఉన్నాయని బన్నీ వాసు తెలిపారు.. ప్రతిరోజు ఆయన వద్దకు రావడం ఆయనతో తిట్లు తినందే నాకు రోజు గడవదని, ఆయన నాకు గాడ్ ఫాదర్ అంటూ కూడా పలు సందర్భాలలో తెలియజేశారు.
19 సంవత్సరాల వయసు…
ఇకపోతే తాజాగా బన్నీ వాసు సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మిత్రమండలి(Mitra Mandali) సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బన్నీ వాసు మరోసారి అల్లు అరవింద్ గారితో తనకున్నటువంటి అనుబంధం గురించి అందరితో పంచుకున్నారు. నేను అల్లు అరవింద్ గారి వద్దకు వచ్చినప్పుడు నా వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే అని తెలిపారు. ఇలా 19 సంవత్సరాల వయసులో ఉన్న నన్ను తీసుకెళ్లి అల్లు అర్జున్ (Allu Arjun) వాచ్ మెన్ గా (Watch Man)పెట్టారని తెలియజేశారు. ఇలా అప్పటినుంచి బన్నీ దగ్గర ఉండిపోయానని నేను నా లైఫ్ లో ఏదైనా మిస్ అయ్యాను అంటే అందుకు అల్లు అర్జున్ గారే కారణమని తెలిపారు.
ఇలా అల్లు అర్జున్ దగ్గర 19 సంవత్సరాల నుంచే బన్నీ వాసు కొనసాగుతూ తనకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఈయనే చూసుకునే వారని తెలియజేశారు. ఇక బన్నీ అల్లరి గురించి అందరికీ తెలిసిందే. తను పబ్ కి వెళ్లడమే కాకుండా తనతో పాటు నన్ను కూడా తీసుకెళ్లే వారని అర్ధరాత్రి కాడ తిరిగి ఇంటికి వస్తే ఈయన మాత్రం ఒక హెడ్ మాస్టర్ లాగా మమ్మల్ని కనిపెడుతూ ఉండేవారు అంటూ అప్పటి సంగతులను బన్నివాసు ఈ కార్యక్రమంలో బయటపెట్టారు..19 సంవత్సరాల వయసు నుంచే అల్లు కుటుంబంలో తాను ఒకడిగా ఉన్నానని బన్నీ వాసు తెలియజేశారు. ఇలా అల్లు అరవింద్ వద్ద ఉంటూ నిర్మాతగా కూడా ఈయన ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందు