Minister Rammohan Naidu: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయింది. మేఘాని నగర్ ప్రాంతంలో కూలిన ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రియాక్ట్ అయ్యారు. ఘటన గురించి తెలియగానే షాకైనట్టు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, పరిస్థితిని వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి మంత్రి బయలుదేరి వెళ్లారు.
గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలు దేరింది ఎయిరిండియా బోయింగ్ 727 ట్విన్ జెట్ విమానం. టేకాప్ అయిన కొద్దిసేపటికే నివాసాలున్న మేఘాని నగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు.
వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉంది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ 8200 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. కోపైలట్‌కు 1100 గంటల విమానయాన అనుభవం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆ విమానం సుదూర ప్రయాణించాల్సి ఉండడంతో భారీగా ఇంధనం నింపారు. క్రాష్ తర్వాత సంభవించిన పేలుడు మంటల తీవ్రతను మరింత పెంచింది. ఘటన తర్వాత అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు.
ALSO READ: అహ్మదాబాద్ విమాన ఘటన.. ఇదిగో ఇలా కుప్పకూలింది, వైరల్ వీడియా
విమానం ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఘటనకు సంబంధించి వివరాలు తనకు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని మంత్రిని ఆదేశించారు.
అటు కేంద్రం హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని మోదీ మాట్లాడారు. విమానం కూలిన చోట రెండు భారీ భవనాలకు మంటలు అంటుకున్నట్లు సమాచారం. మరోవైపు ఘటన తర్వాత ఎయిర్ క్రాప్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఇతర అధికారులు అక్కడికి బయలుదేరి వేళ్లారు. విమానం ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పౌరవిమానయాన శాఖ వర్గాలు తెలిపాయి.
సహాయక చర్యలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తామన్నారు ఎయిరిండియా ఛైర్మన్ చంద్రశేఖరన్. ఘటన తర్వాత ఎమర్జెన్సీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్న ఆయన, బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు.
Shocked and devastated to learn about the flight crash in Ahmedabad.
We are on highest alert. I am personally monitoring the situation and have directed all aviation and emergency response agencies to take swift and coordinated action.
Rescue teams have been mobilised, and all…
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 12, 2025
Air India confirms that flight AI171, from Ahmedabad to London Gatwick, was involved in an accident today after take-off.
The flight, which departed from Ahmedabad at 1338 hrs, was carrying 242 passengers and crew members on board the Boeing 787-8 aircraft. Of these, 169 are…
— Air India (@airindia) June 12, 2025