BigTV English

Nithin : ‘తమ్ముడు’ కోసం నితిన్ షాకింగ్ నిర్ణయం..?

Nithin : ‘తమ్ముడు’ కోసం నితిన్ షాకింగ్ నిర్ణయం..?

Nithin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ మూవీ ఘోరంగా నిరాశపరిచింది. ప్రస్తుతం తమ్ముడు మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా నితిన్ ఇందులో కనిపిస్తున్నాడు. ఈరోజు మూవీని జూలై 4న థియేటర్లలోకి రాబోతుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈరోజు మధ్య హీరోలు పారితోషికాలు తగ్గించుకుంటే కచ్చితంగా నిర్మాతలు నష్టపోరని చాలామంది చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్యకాలంలో హీరోలు కూడా గొప్ప మనసును చాటుకుంటున్నారు. సినిమా కనుక నష్టపోతే.. తాము తీసుకున్న రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేస్తున్నారు.ఇదిలా ఉండగా తమ్ముడు సినిమా నితిన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని టాక్.. అదేంటో తెలుసుకుందాం..


‘తమ్ముడు’ కోసం నిర్ణయం మార్చుకున్న నితిన్..

హీరో నితిన్ కొత్త పద్ధతికి నాంది పలికాడు. సినిమా హిట్ అయ్యాకనే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసి ఇవ్వమని నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ దిల్ రాజు.. తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.. అయితే నితిన్ కేవలం ఈ సినిమా కోసమే పారితోషికం తగ్గించుకున్నాడా.. ? తరువాత తీసే సినిమాలన్నింటికి ఇదే పద్దతిని పాటిస్తాడా.. ? అని తెలియలంటే యల్లమ్మ మూవీ మొదలయ్యాకే బడ్జెట్ వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.


Also Read :బిగ్ బాస్ లోకి సీరియల్ హీరోయిన్.. హుగ్గులు, ముద్దులే..?

స్టోరీ విషయానికొస్తే.. 

ఇదొక అక్కా, తమ్ముళ్ల సెంటిమెంట్ మూవీ.. ప్రమాదాల నుంచి అక్కను కాపాడేందుకు ఏమైనా చేసే తమ్ముడి చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉండనుందని టాక్.. ఈ మూవీలో నితిన్ కు జోడిగా కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ నటిస్తుంది.. నితిన్ కు అక్కగా హీరోయిన్ లయ నటిస్తుంది. ఈ మూవీ తర్వాత లయ బిజీ అవుతుందేమో చూడాలి.. ఇకపోతే సౌరభ్ సచ్‍దేవ, వర్ష బొల్లమ్మ, స్వస్తిక ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీకి అజ్నీశ్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. భీష్మ తర్వాత మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు నితిన్. ఈ మూవీ హిట్ అయితే నితిన్ జాక్ పాట్ కొట్టినట్లే.. చూడాలి ఏం జరుగుతుందో.. నితిన్ ఈ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.. ఈరోజు మూవీ తర్వాత బలగం డైరెక్టర్ వేణు కాంబోలో ఎల్లమ్మ మూవీ చెయ్యనున్న విషయం తెలిసిందే. ఈరోజు మూవీని త్వరగా కంప్లిట్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. ఆ తరువాత సినిమాల రిజల్ట్ లను బట్టి కొత్త సినిమాలకు గ్యాప్ తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×