BigTV English

Game Changer : ‘గేమ్ ఛేంజర్ ‘ కు మరో షాక్.. ఎంతకు తెగించార్రా..

Game Changer : ‘గేమ్ ఛేంజర్ ‘ కు మరో షాక్.. ఎంతకు తెగించార్రా..

Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోలో హీరోగా త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్.. ఈ మూవీ భారీ అంచనాలతో జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది.. రిలీజ్ కు ముందు భారీ అంచాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ అంచాలకు రీచ్ అవ్వలేదు.. మొదటి రోజే మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది.. కానీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేసింది.. మొదటి రోజు భారీగానే వసూల్ చేసింది. అలాగే రెండో రోజు కూడా కలెక్షన్స్ ఎక్కువగానే రాబట్టింది. అయితే పెద్ద హీరోల సినిమాలకు ఫైరసి తప్పలేదు.. రామ్ చరణ్ మూవీ కూడా ఫైరసికి గురైంది. రిలీజ్ అయిన మొదటి రోజే గేమ్ ఛేంజర్ కు షాక్ తప్పలేదు. తాజాగా ఓ బస్ లో ఏకంగా ఫైరసి వీడియోను ప్లే చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


మూవీ ఫైరసీ దెబ్బ.. 

ఈ మూవీ తొలి రోజే రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకంటించింది. అయితే రిలీజైన రెండో రోజుకే ఈ సినిమాకు బిగ్ షాక్ తగిలింది. సినిమాను పైరసీ బూతం వెంటాడింది. హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది. అది చూసి అంతా షాక్ అయిపోయారు.. కొన్ని ఆన్ లైన్ మూవీ డౌన్ లోడ్ వెబ్ సైట్స్ అయిన.. తమిళ్రాకర్స్, మూవీరూల్స్, ఫిల్మీజిల్లా, టెలిగ్రాం,ఐబోమ్మ లాంటి వెబ్ సైట్లలో ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇప్పుడు ఆ ప్రింట్ సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం బస్సుల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నెటిజన్లు మూవీ టీమ్ అలెర్ట్ అవ్వకుంటే ఇక సినిమాకు లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు..


గేమ్ ఛేంజర్ మూవీ స్టోరీ.. 

రామ్ రామ్ నందన్ అనే IAS అధికారిగా అప్పన్న అనే పాత్రలో నటించాడు. కియారా దీపికగా నటించగా, అంజలి పార్వతి అనే పాత్రలో కనిపించింది. సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించగా తమన్ సంగీతాన్ని అందించారు.. ఇదిలా ఉండగా ఈ మూవీ యూనిట్ కు తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రిలీజ్ కు ముందు అనుమతిచ్చిన స్పెషల్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గేమ్ ఛేంజర్ మూవీకి కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జే సూర్య తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటించారు. సంక్రాంతికి కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×