Principal Strips Girls | పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పడం కోసం గురువులు వారిని దండించవచ్చు. వారికా అధికారం, బాధ్యతలు ఉన్నాయి. కానీ ఆ దండన.. ఆ శిక్ష మితిమీరితే ఆ ఉపాధ్యాయునికే కళంకం. తాజాగా ఒక స్కూల్ ప్రిన్సిపాల్ కూడా పిల్లలు పాఠశాల నియమాలను ఉల్లంఘించారని క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. అందరి బట్టలు విప్పదీసారు. అయితే ఆయన టీనేజ్ అమ్మాయిల బట్టలు విప్పదీయించాడు. ఇది వారికి ఆయన విధించిన శిక్ష. కానీ ఈ విద్యార్థినుల బట్టలు విప్పదీయించే శిక్ష ఏమిటని వారి తల్లిదండ్రులు మండిపోతున్నారు. ఏకంగా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఝార్ఖండ్ జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఝార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లా దిగ్వాదిహ్ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ స్కూల్ లో ఇటీవల ‘పెన్ డే’ జరుపుకున్నారు. ఈ కారణంగా 10వ తరగతి స్టూడెంట్స్ అందరూ తమ చొక్కాల వెనుక కొన్ని మెసేజెస్, ఇన్‌స్పిరేష్నల్ కోట్స్ రాసుకొచ్చారు. కానీ యూనిఫామ్ పై అలా రాతలు రాయడం స్కూల్ నియమాలకు వ్యతిరేకమని ప్రిన్సిపాల్ వారందరినీ ముందు తరగతుల బయట నిలబెట్టారు.
Also Read: ఇంట్లో దొంగతనానికి వెళ్లి మహిళను ముద్దాడిన దొంగ.. ఎలా పట్టుకున్నారంటే..
ఆ విద్యార్థుల్లో 80 మంది ఆడపిల్లలే ఉండడం గమనార్హం. ఆ తరువాత విద్యార్థులందరూ ఆ చొక్కాలు విప్పదీసి ఇంటి కెళ్లాలని ప్రిన్స్‌పాల్ ఆదేశించారు. దీంతో పదవ తరగతి విద్యార్థినులను షర్టులు విప్పదీయించారు. ఆ తరువాత వారంతా స్కూల్ యూనిఫామ్ లో భాగమైన బ్లేజర్లు (సూట్ పై భాగం) మాత్రమే వేసుకొని ఇళ్లకు బయలుదేరారు.
టీనేజ్ అమ్మాయిలని కూడా చూడకుండా ప్రిన్స్ పాల్ వారి బట్టలు విప్పదీయించడం పట్ల తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ఎమెల్యే కూడా స్పందించారు. ఆ స్కూల్ ప్రిన్స్ పాల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాతో ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ మాట్లాడుతూ.. పదవ తరగతి చదువుకునే అమ్మాయిలు టీనేజర్లు. ఈ వయసు ఉన్న విద్యార్థుల పట్ల ప్రిన్సిపాల్ విచక్షణా రహితంగా వ్యవహరించారని మండిపడ్డారు. స్టూడెంట్స్ అంతా క్షమాపణలు చెప్పినా సదరు ప్రిన్స్ పాల్ పరిధి దాటి దండించారని చెప్పారు.
విద్యార్థినుల తల్లిదండ్రులు జిల్లా డిప్యూటీ కమిషనర్ ను కలిసి ప్రిన్స్ పాల్ పై ఫిర్యాదు చేశారు. డిప్యూటీ కమిషనర్ మాధవి మిశ్రా స్కూల్ ప్రిన్స్ పాల్ పై చర్యలు తీసుకుంటామని.. నిజనిర్ధారణ కోసం అయిదు మంది సభ్యులతో కూడిన ఒక కమిటీ వేస్తామని తెలియజేశారు. ఈ కమిటీలో జిల్లా విద్యాధికారి, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ పై స్కూల్ ప్రిన్స్ పాల్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.