BigTV English

Anupama About Ram Charan: చెర్రీ ప‌క్క‌న ల‌క్కీఛాన్స్… అలా వ‌దులుకుందా అనుప‌మ‌?

Anupama About Ram Charan: చెర్రీ ప‌క్క‌న ల‌క్కీఛాన్స్… అలా వ‌దులుకుందా అనుప‌మ‌?

Anupama About Ram Charan: స్టార్ హీరో ప‌క్క‌న హీరోయిన్‌లా ల‌క్కీ ఛాన్స్ అంటే ఎవ‌రైనా వ‌దులుకుంటారా? అనుప‌మ వ‌దులుకుంది. అందుకు రీజ‌న్ కూడా చాలా సిల్లీగా ఉంది. సిల్లీ రీజ‌నే అయినా సిన్సియ‌ర్‌గా క‌న్వే చేశారు డైర‌క్ట‌ర్ సుకుమార్‌. అనుప‌మ న‌టించిన 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజ‌ర‌య్యారు సుకుమార్‌. ఈ సినిమాలో అనుప‌మ నాయిక‌గా న‌టించింది. నిఖిల్ హీరో. హ్యాపీడేస్ చూసిన త‌ర్వాత నిఖిల్ మంచి హీరో అవుతాడ‌నే ఉద్దేశంతో అప్ప‌ట్లోనే ల‌క్ష రూపాయ‌లు అడ్వాన్స్ ఇచ్చిపెట్టార‌ట సుకుమార్‌. అంత దూర‌దృష్టి ఆయ‌న‌ది. ఈ స్టేజ్ మీద నిఖిల్ గురించి మాట్లాడిన తర్వాత హీరోయిన్ గురించి కూడా చెప్పారు సుకుమార్‌. త‌ను రాసుకున్న రంగ‌స్థ‌లం సినిమా క‌థ‌కు ముందు హీరోయిన్‌గా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ని అనుకున్నార‌ట‌. అయితే ఆ సినిమా కోసం ఆడిష‌న్స్ చేసిన‌ప్పుడు అస్త‌మానం అనుప‌మ వాళ్ల‌మ్మ వైపు చూస్తూ ఉండేవార‌ట‌. ప్ర‌తి షాట్‌కీ, ప్ర‌తి సీన్‌కీ త‌ర్వాత ఆమె అలా చూస్తూ ఉండ‌టంతో, వామ్మో.. రేపు షూటింగ్‌లో కూడా ఇలా అస్తమానూ అమ్మ వైపు చూస్తూ కూర్చుంటే క‌ష్టం అని అనిపించింద‌ట సుకుమార్‌కి. అందుకే ఆ సినిమా నుంచి అనుప‌మ‌ని వైదొల‌గించారు.


చ‌ర‌ణ్‌తో అనుప‌మ సినిమా మిస్ అయింద‌న్నది అప్ప‌ట్లో చాలా పెద్ద టాక్‌. కొంత పోర్ష‌న్ చేశాక‌, ఆమెను ప‌క్క‌న పెట్టి స‌మంత‌ను తీసుకున్నార‌నే మాట‌లు బాగానే వైర‌ల్ అయ్యాయి. చ‌ర‌ణ్ ప‌క్క‌న మ రీ చిన్న పిల్ల‌గా ఉంద‌ని, అనుప‌మ వ‌ద్ద‌ని చిరంజీవి స‌జెస్ట్ చేశార‌ని, అప్ప‌ట్లో ర‌క‌ర‌కాలుగా మాట‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే 18 పేజెస్ వేదిక మీద వాట‌న్నిటికీ ఓ క్లారిటీ వ‌చ్చేసింది.
అనుప‌మ‌ని ఎవ‌రూ వ‌ద్ద‌న‌లేదు,సెట్లో ఆమె బిహేవియ‌ర్‌, అప్ప‌ట్లో ఆమె ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, బంగారం లాంటి అవ‌కాశాన్ని దూరం చేశాయి. లేకపోతే ఈ పాటికి చిట్టిబాబు ప‌క్క‌న రామ‌ల‌క్ష్మిలా మ‌రో రేంజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆమె వికీపీడియాలో ఉండేది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×