BigTV English

Severe Heat Waves : ఢిల్లీలో వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో అతి తీవ్ర వడగాలులు.. ఎన్నడూ చూడనంత వేడి తప్పదా ?

Severe Heat Waves : ఢిల్లీలో వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో అతి తీవ్ర వడగాలులు.. ఎన్నడూ చూడనంత వేడి తప్పదా ?

Severe Heat Waves Alert for AP&Telangana : దేశంలో భిన్నవాతావరణం నెలకొంది. రాజధాని ఢిల్లీలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తుందని, అలాగే ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై గంటకు 25-35 కిలోమీటర్ల వేగంతో జల్లులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. శుక్రవారం ఢిల్లీ, ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడంతో.. వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.


కాగా.. దేశంలో మిగతా రాష్ట్రాల్లో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతుంది. తీవ్రమైన ఎండలకు తోడు వేడిగాలులు ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదురోజుల్లో వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read : దంచికొడుతున్న ఎండలు.. హాఫ్‌ సెంచరీ దిశగా భానుడు


రాయలసీమ, ఇంటీరియర్ కర్ణాటక, తమిళనాడు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో 26 నుంచి 28 తేదీల్లో, కేరళ, మహేలలో 27 నుంచి 29 తేదీల్లో, కొంకణ్, మధ్య పశ్చిమ ఉత్తరప్రదేశ్, కోస్తా, యానాంలలో 28 నుంచి 30 తేదీల్లో అతితీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. ఐదురోజులపాటు గతంలో ఎన్నడూ చూడనంత వేడి తప్పదని హెచ్చరించింది.

తెలంగాణలోని కొన్నిజిల్లాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. శుక్రవారం అత్యధికంగా జమ్మికుంటలో 45.6 డిగ్రీలు, వరంగల్, నల్గొండ కరీంనగర్ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు ప్రైవేట్ టీర్, కూలీ మరణించినట్లు అధికారులు తెలిపారు.

 

Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×