E-Paper
Advertisement

Anupama Parameswaran: మరోసారి బోల్డ్ పాత్రలో అనుపమ.. ‘టిల్లు స్క్వేర్’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Anupama Parameswaran: మరోసారి బోల్డ్ పాత్రలో అనుపమ.. ‘టిల్లు స్క్వేర్’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Advertisement

Anupama Parameswaran: మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అంటే చాలామంది తెలుగు ప్రేక్షకులకు ఇష్టం. ఎక్కువగా పక్కింటమ్మాయి పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ తెలుగువారికి దగ్గరయ్యింది అనుపమ. అయితే ఎప్పుడూ ఒకేలాగా ఉంటూ, ఒకే రకమైన పాత్రలు చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా.. అందుకే అనుపమ కూడా చాలామంది ఇతర హీరోయిన్లలాగానే రూటు మార్చింది. గ్లామర్ షోకు ఓకే చెప్పింది. అంతే కాకుండా ఆన్ స్క్రీన్ బోల్డ్ లిప్ లాక్‌లకు కూడా వెనకాడలేదు. ఇప్పటినుండి తనలోని మరో కోణాన్ని చూస్తారని ప్రేక్షకులకు ఛాలెంజ్ కూడా చేసింది. చెప్పినట్టే మరో బోల్డ్ క్యారెక్టర్‌ను ఓకే చేసింది అనుపమ.

ప్రయోగాలు పక్కా

Advertisement

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘టిల్లు స్వ్వేర్’ సినిమాలో లిల్లీ అనే పాత్రలో కనిపించింది అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). అప్పటివరకు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్రల్లోనే కనిపించిన అనుపమ.. ఒక్కసారిగా ‘టిల్లు స్క్వేర్’తో తన స్టైలే మార్చేసింది. దీంతో ప్రేక్షకులంతా షాకయ్యారు. చాలామంది తనను క్రష్ లిస్ట్ నుండి తీసేశారు. ఈ సినిమాలో తను చేసిన పాత్ర వల్ల అనుపమకు చాలా నెగిటివిటీ కూడా వచ్చింది. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇప్పటినుండి తనకు నచ్చినట్టుగా డిఫరెంట్ రోల్స్‌ను ఎంచుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చింది. చెప్పినట్టుగానే ఒక తమిళ సినిమాలో మరోసారి హీరోతో ఘాటు రొమాన్స్‌కు సిద్ధపడింది అనుపమ.

Also Read: డ్రాగన్ టైటిల్ కొట్టేసిన కుర్ర హీరో.. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ పరిస్థితి ఏంటి.. ?

Advertisement

రొమాంటిక్ సీన్స్

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. పైగా అందులో ఒక మూవీ జోనర్‌కు మరో మూవీ జోనర్‌కు అసలు సంబంధం లేదు. అందులో ఒక సినిమానే ‘డ్రాగన్’ (Dragon). ఈ మూవీని అస్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తుండగా ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటిస్తున్నాడు. తాజాగా దసరా సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేస్తూ పలు పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్లను బట్టి చూస్తే టైటిల్ పాత్రలో ప్రదీప్ రంగనాథ్ నటిస్తుండగా.. తను ప్రేమించే అమ్మాయి కీర్తి పాత్రలో అనుపమ కనిపించనుంది. అందులో ఒక పోస్టర్‌ చూస్తుంటే ‘డ్రాగన్’లో అనుపమ, ప్రదీప్ మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉండనున్నాయని అర్థమవుతోంది.

కాలేజ్ స్టూడెంట్‌గా

టైటిల్ వినగానే ‘డ్రాగన్’ అంటే ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులు ఊహించే ఛాన్స్ ఉంది. కానీ ఇది పక్కా యూత్‌ఫుల్ సినిమా అని పోస్టర్లు చూస్తేనే క్లారిటీ వస్తుంది. ‘టిల్లు స్క్వేర్’ కూడా ఇలాంటి ఒక యూత్‌ఫుల్ సినిమానే. దాంతోనే మొదటిసారి గ్లామర్ షో, లిప్ లాక్‌కు ఓకే చెప్పింది అనుపమ. ఇప్పుడు ‘డ్రాగన్’ను చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. ఇందులో కూడా హీరోతో కెమిస్ట్రీ పండించడం కోసం రొమాంటిక్ సీన్స్‌ను చేయడానికి అనుపమ ఓకే చెప్పిందా? ‘టిల్లు స్క్వేర్’ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందా? అని ఫ్యాన్స్‌లో చర్చలు నడుస్తున్నాయి. మొత్తానికి మరోసారి ‘డ్రాగన్’లో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో అలరించనుంది ఈ ముద్దుగుమ్మ.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×