BigTV English

TDP Central Office : టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అనూహ్యం… కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు

TDP Central Office : టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అనూహ్యం… కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు

TDP Central Office : ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్‌పై దాడి కేసులో అనూహ్య మలుపు తీసుకుంది. ఈ మేరకు ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య సోమవారం కోర్టులో లొంగిపోయాడు.


వైసీపీ ప్రభుత్వంలోనే…

వైసీపీ హయాంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా 2021, అక్టోబర్ 19న కొందరు ఆ పార్టీ వ్యక్తులతో కలిసి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నానా హంగామా చేశారు. ఇది మంగళగిరిలో ఉంది. వైసీపీ నేతలు దేవినేని అవినాష్ ,లేళ్ల అప్పిరెడ్డి , ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులే పార్టీ ఆఫీస్ పై దాడికి పూనుకున్నారన్న అభియోగాలు దాఖలయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు.


వైసీపీ ఎమ్మెల్సీకి ప్రధాన అనుచరుడు…

వైసీపీ విద్యార్థి విభాగం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య, గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై దాడి చేసినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. చైతన్య వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డికి ప్రధాన అనుచరుడుగా గుర్తింపు పొందాడు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

సోమవారం విచారణకు హాజరు…

వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సోమవారం ఈ కేసులో పోలీస్ విచారణకు హాజరయ్యారు. వీరిని మంగళగిరి రూరల్ పోలీసులు విచారించగా, దాడి జరిగిన రోజు వీరంతా ఉదయం ఎక్కడ కలిశారు, ఏఏ ప్రాంతాలను తిరిగారు లాంటి వివరాలను రాబట్టారు.

కేసు సీఐడీ చేతిలోకి…

పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో విచారణ జోరు అందుకోవాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓవైపు తెలుగుదేశం కార్యాలయంపై దాడి, మరోవైపు ఆనాటి అపోసిషన్ లీడర్, నేటి ప్రభుత్వాధినేత సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులను కలిపి సీఐడీకి బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో కేసు మంగళగిరి, తాడేపల్లి పోలీసుల నుంచి సీఐడీ చేతిలోకి వెళ్లింది. ఈ మేరకు కేసుల విచారణ ఫైళ్లను సీఐడీ చేతికి అప్పగించేశారు మంగళగిరి డీఎస్పీ. ఈ నేపథ్యంలోనే అజ్ణాతంలోకి వెళ్లిపోయిన పానుగంటి చైతన్య బయటకు వచ్చేశాడు. వెంటనే కోర్టులో లొంగిపోవడం గమనార్హం.

Also read : ఆ డ‌బ్బుల‌న్నీ ఏం చేశావ్ జ‌గ‌న్‌.. పల్లె పండుగలో పవన్ ప్రశ్న.. సినిమా గురించి కూడా

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×