BigTV English

Anupama: ఆ స్టార్ హీరో కొడుకుని వలలో వేసుకున్న అనుపమ.. ముద్దుతో దొరికిపోయింది..

Anupama: ఆ స్టార్ హీరో కొడుకుని వలలో వేసుకున్న అనుపమ.. ముద్దుతో దొరికిపోయింది..

Anupama: టాలీవుడ్ క్యూట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మలయాళ సినిమా ప్రేమమ్ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత సినిమా ‘అ ఆ’ లో నెగిటివ్ రోల్ లో కనిపించారు. తర్వాత వరుసగా సినిమాలు చేసినా కార్తికేయ 2 తో తనకి మంచి హిట్టుని సొంతం చేసుకుంది. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో మన ముందుకు వచ్చి, డీసెంట్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. గత కొంతకాలంగా ఈ అమ్మడు ఒక స్టార్ హీరో కొడుకుతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు గుప్పు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు ఆ వార్తలకు ప్రాణం పోసింది ఈ ఫోటో. ప్రస్తుతం ఆ ఫోటోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ఫోటోపై తెగ కామెంట్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఈ అమ్మడి బండారం మొత్తం బట్ట బయలైయింది.. ఇంతకీ ఆ ఫోటో ఉన్నది ఏ స్టార్ హీరో కొడుకో మీరు కూడా చూసేయండి..


ఆ స్టార్ హీరో కొడుకుతో ..

మలయాళ ముద్దుగుమ్మ, అనుపమ పరమేశ్వరన్. చిన్నా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ విక్రమ్ హీరో గా నటించిన ‘బైసన్’ మూవీలో హీరోయిన్ గా అనుపమ నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ చియా విక్రమ్ కొడుకు ధ్రువ విక్రమ్ నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అనుపమ, ధృవలకు సంబంధించిన లిప్ లాక్ ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. వీరిద్దరూ లిప్ లాక్ లో ఉన్న పిక్ బయటకు వచ్చింది. సినిమాలో భాగంగా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారిందని, దీంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. స్టార్ హీరో కొడుకుని వలలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక ముద్దుతో దొరికిపోయింది అని అంటున్నారు నెటిజెన్లు. ఇలాంటి రూమర్స్ అనుపమ పై అంతకు ముందు కూడా వచ్చాయి. ఆ స్టార్ హీరో కొడుకు కన్నా అనుపమ రెండేళ్లు పెద్దదన్న వార్త కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇలాంటి వార్తలపై అనుపమ ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు ఏకంగా ధ్రువ తో అనుపమ లిప్ లాక్ పెడుతున్న ఫోటో తో వాళ్ల ప్రేమ వ్యవహారంతో పాటు వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్న విషయం అయితే బయటకు వచ్చింది.


అనుపమ కెరియర్ ..

అనుపమ సినిమలా విషయానికి వస్తే.. తెలుగులో అనుపమ వరుసగా సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో, కోలీవుడ్ లో తొలిపరిచయం అవుతున్న హీరోల నుండి స్టార్ హీరోలతోనూ కలిసి నటిస్తున్నారు. శర్వానంద్ తో శతమానం భవతిలో లంగా వోణితో మెప్పించారు. తర్వాత రామ్ తో హలో గురు ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ, నిఖిల్ తో 18 పేజీస్, ఆశిష్ రెడ్డితో రౌడీ బాయ్స్, సిద్దు జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మెప్పించారు. తాజాగా అస్విత్ మారిమూత్ దర్శకత్వంలో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ డ్రాగన్ లోను నటించి మెప్పించారు. తెలుగులో అనుపమ నటించిన పరదా అనే మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×