Anushka Shetty: లేడీ ఓరియంటెడ్ పాత్రలకు చాలా తక్కువ మంది హీరోయిన్లు సెట్ అవుతారు. అలా సెట్ అయ్యే హీరోయిన్లలో అనుష్క శెట్టి(Anushka Shetty) ఒకరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనుష్క. అయితే అలాంటి అనుష్క ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంత పెద్ద హీరోయినో చెప్పనక్కర్లేదు. కానీ హీరోయిన్ కాకముందు చాలామంది సెలబ్రిటీలు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్లే. అలాంటి వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు. ఎందుకంటే అనుష్క శెట్టి సినిమాల్లో హీరోయిన్ కాకముందు కొన్ని సీరియల్స్ చేసిందట.అలా సీరియల్స్ చేస్తూ సినిమాల్లో హీరోయిన్ అవ్వాలని కలలుకని, ఆ తర్వాత కొంతమంది అవమానం భరించలేక ఇండస్ట్రీకి గుడ్ బై చెబుదామనుకుందట. కానీ ఆ తర్వాత సూపర్ (Super) సినిమాలో అనుష్క శెట్టికి అవకాశం వచ్చి , ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉంది.మరి అలాంటి అనుష్క సినిమాల్లోకి రాకముందు ఓ సీరియల్ లో చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
అనుష్క నటించిన సీరియల్ ఇదే..
.
రీసెంట్ గా యాంకర్ రష్మీ (Rashmi) ఓ సీరియల్ లో నటించిన వీడియో నెట్టింట్లో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. యువ అనే సీరియల్లో యాంకర్ రష్మీ రాజమౌళి (Rashmi-Rajamouli) మధ్య జరిగిన లవ్ ట్రాక్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.’యువ’ అనే సీరియల్ లోకి రాజమౌళి గెస్ట్ గా వచ్చారు.అలాగే ఈ సీరియల్ లో రాజమౌళి – రష్మీల లవ్ ట్రాక్ చూపించారు. అయితే ఈ వీడియో వైరల్ అవుతుండగానే అనుష్క శెట్టి కి సంబంధించి మరో వీడియో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే యువ సీరియల్ లో అనుష్క శెట్టి కూడా గెస్ట్ రోల్ పోషించింది. రష్మీ, కృష్ణుడు, కరాటే కళ్యాణి, వాసు వంటి వాళ్ళు ఈ సీరియల్లో నటించారు. ఇక ఈ సీరియల్ లో వాసు పాత్రలో నటించిన యాక్టర్ కి అనుష్క శెట్టి లవర్ పాత్రలో నటించి గెస్ట్ రోల్ చేసింది. అయితే అప్పటి సీరియల్ లో అనుష్క చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారడంతో ఈ సీరియల్ లో అనుష్క శెట్టి కూడా చేసిందా అని చాలామంది అభిమానులు షాక్ అవుతున్నారు.అయితే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన యువ(Yuva) సీరియల్ అన్నపూర్ణ స్టూడియోలో తెరకెక్కింది.ఇక ఈ సీరియల్ రావడానికి రాజమౌళి,అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) పాత్ర కూడా ఉందట.
http://Samantha: 3 రోజులు అనుభవం.. భయం వేస్తోంది అంటున్న సామ్.. ఏమైందంటే..?
అనుష్క సినిమాలు..
ఇక నాగార్జున రాజమౌళితో ఉన్న బంధం కారణంగానే అనుష్క శెట్టి ఇందులో గెస్ట్ రోల్ పోషించడానికి ఒప్పుకుందట. ఇక ఈ సీరియల్లో వాసు పాత్రకి లవర్ గా నాగలక్ష్మి అనే గెస్ట్ రోల్ చేసింది అనుష్క. యువ సీరియల్ లో ఒక కేఫ్ లో అనుష్క శెట్టి ఎంట్రీ ఇవ్వడంతోనే అక్కడున్న అమ్మాయిలు అందరూ ఆమె అందాన్ని చూసి చాలా అసూయగా ఫీల్ అవుతుంటారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇక అనుష్క శెట్టి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడితో ఘాటి(Ghati) అనే మూవీలో నటిస్తుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">