BigTV English

Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ.. ఇక కబ్జాగాళ్ల మక్కెలు ఇరగదీశుడే!

Hydra Police Station: హైడ్రా పోలీస్ స్టేషన్ రెడీ.. ఇక కబ్జాగాళ్ల మక్కెలు ఇరగదీశుడే!

Hydra Police Station: హైడ్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైడ్రా పేరు వింటేనే అక్రమదారులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.  అయితే హైడ్రాకు ప్రభుత్వం రోజురోజుకీ మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఆర్థికంగా ప్రభుత్వం ఫుల్ సపోర్టు చేస్తోంది. గతంలో హైడ్రాకు పోలీస్ స్టేషన్ కూడా అందుబాటులోకి రానుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయ్యాక హైడ్రాకు మరింత బలం చేకూరనుంది.


ALSO READ: Indian Post Office: పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు.. NO EXAM.. డైరెక్ట్ జాబ్..

మార్చిలో హైడ్రా పోలీస్ స్టేషన్:


మార్చి మొదటి వారంలో హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే హైడ్రా పోలీస్ స్టేషన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అన్ని రకాల పనులు ఫిబ్రవరి చివరి వారంలోగా పూర్తి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ లో కావాల్సిన సిబ్బంది గురించి కమిషనర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అందబాటులో హైడ్రా వెబ్ సైట్, యాప్:

హైడ్రాకు ఒక పోలీస్ స్టేషనే కాక వెబ్ సైట్, మొబైల్ యాప్ కూడా అందుబాటులోకి రానున్నాయి. హైడ్రాకు సంబంధించిన వెబ్ సైట్ ,  మొబైల్ యాప్ కూడా రూపొందించేందుకు ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. మొబైల్ యాప్ లో చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ల వివరాలను తెలియజేయనున్నారు. దీంతో భాగ్యనగర వాసులకు ఎలాంటి స్థలం కొనాలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎక్కడ ల్యాండ్ కొనకూడదో తెలుసుకోవచ్చు. హైడ్రా పోలీస్ స్టేషన్, వెబ్ సైట్, యాప్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. మార్చి ఫస్ట్ వీక్ లో ఈ మూడు అందుబాటులోకి రానున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.

హైడ్రా ప్రధాన కార్యాలయానికి పైగా ప్యాలెస్ ను కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ భవంతికి సంబంధించిన మరమ్మతులను హెచ్ఎండీఏ చేపడుతోంది. పైగా ప్యాలెస్ భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ కూడా ఇచ్చింది. అయితే, ఈ మరమ్మతుల పనులు అన్నీ పూర్తి కావడానికి సంవత్సర కాలం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అలాగే రీజనల్ అఫీసులను కూడా ఏర్పాటు చేయనున్నారు.

భాగ్యనగరానికి సంబంధించిన రీజినల్ కార్యాలయాన్ని బుద్ధ భవన్ లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాచకొండకు సంబంధించిన రీజినల్ కార్యాలయాన్ని తార్నాకలోని పాత హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. సైబరాబాద్ కు సంబంధించిన రీజనల్ కార్యాలయాన్ని నానక్ రాం గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(HGCL)లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వీటి పనులు ప్రారంభమయ్యాయి.

ALSO READ: Group-2 Mains: గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదాపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ అనురాధ క్లారిటీ..

ఈ విధంగా రీజనల్ కార్యాలయాలు:

హైదరాబాద్ – బుద్ధభవన్

రాచకొండ- తార్నాక ఓల్డ్ హెచ్ఎండీఏ ఆఫీస్

సైబరాబాద్ – నానాక్ రాం గూడ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్)

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×