Samantha..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత (Samanth) .. ప్రస్తుతం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఒక మూడు రోజులపాటు అన్నిటికి దూరంగా ఉంటూ ఒక పని చేశానని, ఆ పని చేయడం వల్ల భయం వేస్తోంది అని తెలిపింది సమంత. మరి సమంత ఎందుకు అలా చెప్పింది? ఆ మూడు రోజులపాటు ఏం చేసింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ విషయాన్ని చెబుతూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక సుదీర్ఘ పోస్ట్ కూడా పంచుకుంది. మరి సమంత పెట్టిన పోస్ట్ కి అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం.
మూడు రోజులు నాతో నేనే గడిపాను – సమంత
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలతో పాటు సినిమా అప్డేట్స్ ని అలాగే తన బిజినెస్లకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ధైర్యాన్ని నింపే విషయాలతో పాటు ఆరోగ్య చిట్కాలు కూడా తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ సమంత ఆసక్తికర విషయాలను పంచుకుంది. “మూడు రోజులు నేను మౌనంగా ఉన్నాను. ఫోన్ లేదు.. ఎవరితో కూడా మాట్లాడలేదు. నాతో నేను మాత్రమే గడిపాను. మనతో మనం ఒంటరిగా ఉండడం అంటే అది అతి కష్టమైన పనులలో ఒకటి. కానీ ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్ సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా వింటాను. మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి. మొదట్లో భయం వేస్తుంది. కానీ అన్ని సర్దుకుపోతాయి. ఆ తర్వాత ఒంటరితనానికి అలవాటు పడిపోతారు. మీరు మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఏదీ కూడా కష్టంగా అనిపించదు” అంటూ సమంత తెలిపింది. ఇక ఇది విన్న అభిమానులు సమంత గత తాలూకు అనుభవాలు ఆమెను మానసికంగా మరింత కృంగదీసాయని, అందుకే ఇప్పుడు ఇంత దృఢంగా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.
సమంత సినిమాలు..
సమంత సినిమాల విషయానికి వస్తే.. అటు వెబ్ సిరీస్ లతో పాటు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు ఈ చిత్రం ఉత్తమ వెబ్ సిరీస్ గా “ఐకానిక్ గోల్డ్ అవార్డు” కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో ఆదిత్య ప్రధాన పాత్ర పోషిస్తుండగా ప్రముఖ దర్శక, నిర్మాతలు రాజ్ అండ్ డి కె ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కి తుంబాడ్ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ వెబ్ సిరీస్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిందని, ఆర్థిక వ్యవహారాలలో పెద్ద స్కాం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నట్లు సమాచారం.
Also Read:Tollywood: ‘రానా నాయుడు’ బ్యూటీ పెళ్లిలో పూజా హెగ్డే సందడి..!