BigTV English

Anvesh On Nagarjuna : నాగార్జునపై తీవ్ర ఆరోపణలు చేసిన యూట్యూబర్ అన్వేష్, చిక్కుల్లో పడతాడా?

Anvesh On Nagarjuna : నాగార్జునపై తీవ్ర ఆరోపణలు చేసిన యూట్యూబర్ అన్వేష్, చిక్కుల్లో పడతాడా?

Anvesh On Nagarjuna : యూట్యూబర్ అన్వేష్ గత కొద్ది రోజులుగా బెట్టింగ్ బాధితులు నిమిత్తం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వాళ్లపైన రెగ్యులర్ గా వీడియోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అన్వేష్ ఎవరిని వదలకుండా అందర్నీ దుమ్ము దులపడం మొదలుపెట్టాడు. ఇప్పటికే చాలామంది గురించి వీడియోలు చేశాడు. ఇక ప్రస్తుతం అన్వేష్ టాలీవుడ్ టాప్ హీరో అండ్ ప్రొడ్యూసర్ అక్కినేని నాగార్జున మీద లేటెస్ట్ గా ఒక వీడియోని రిలీజ్ చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉగ్రవాద సంస్థలకు చెందిన బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేశారు. ఒక స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే దాని బాధ్యత టీచర్ ది. స్కూల్ అంతా తప్పు చేస్తే దాని బాధ్యత ప్రిన్సిపాల్ ది. బిగ్ బాస్ కి సంబంధించి టీచర్ ప్రిన్సిపాల్ నాగార్జున.


నన్ను చెప్పుతో కొట్టండి

భారతదేశానికి సంబంధించి ఏ బెట్టింగ్ యాప్ కూడా లేదు. వీళ్లు ప్రమోట్ చేసిన యాప్స్ అన్ని కూడా ఉగ్రవాద సంస్థలకు చెందినవి. ఐఫోన్ ఉందంటే స్టీవ్ జాబ్స్ ఆపిల్ కంపెనీ, టాటా ఉప్పు ఉందంటే అది రతన్ టాటా అది. అంబానీ, ఆదాని అని పేర్లు ఉంటే మనకు ప్రోడక్ట్ ఏంటో అర్థం అవుతుంది. కానీ వీళ్లు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ ఎవరివో కూడా తెలియదు. వీరందరూ చదువుకున్న వాళ్లే కదా, తిండికి తికాన లేని వారికి మీరు ఒక ప్లాట్ఫార్మ్ ఇచ్చారు. దాని నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్లు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల అమాయకపు ప్రజల జీవితాలు పోయాయి.


బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ పై నాకు వచ్చిన అమౌంట్

ఈ బెట్టింగ్ యాప్స్ అవేర్నెస్ వీడియోలు చేయటం వలన నాకు దగ్గర దగ్గర 45 లక్షలు వచ్చాయి. ఒక 20 ఫ్యామిలీలకి తల రెండు లక్షలు చొప్పున వీటిని అందజేస్తాను. మీరు అన్నపూర్ణ స్టూడియోస్ అమ్మేసి ఈ బెట్టింగ్ బాధితులకి నష్టపరిహారం చెల్లిస్తారా.? చెల్లించరు కదా. ఎందుకు నాకేటి సంబంధం అంటారా.? రైతు బిడ్డ ప్రశాంత్ వరస్ట్ కాండేట్ వాడిని తీసుకొచ్చి మీరు టైటిల్ విన్నర్ ని చేశారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని ఇలాంటి ఎదవల్ని ప్రమోట్ చేశారు. రైతుల కోసం కష్టపడిన వాళ్ళని మీరు తీసుకెళ్లకుండా ఈ ఎదవను తీసుకెళ్లారు. ఒక టీవీ యాంకర్ శివ జ్యోతి కి లగ్జరీ అపార్ట్మెంట్లు ఎలా వచ్చాయి బెట్టింగ్ కేవలం యాప్ వల్ల. ఇలా అందరి బిగ్ బాస్ కంటెస్టెంట్ల జాతకాలను చెప్పుకొచ్చాడు.

Also Read : Devakatta : నా సినిమాలో ఆ యాక్టర్ లేడు, కొంతమంది తప్పుగా రాస్తున్నారు

చిరంజీవి గారు కష్టపడి వచ్చారు

చిరంజీవి గారు అవకాశాల కోసం చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు గోల్డ్ స్పూన్ తో పుట్టారు మీరు. మీకు అది తెలియదు. మీకు ఎలా అయితే తెలియదు ఈ బిగ్ బాస్ వాళ్లకు కూడా అలానే తెలియట్లేదు. ఏమీ లేని వాళ్ళకి ఒక ఫేమ్ ఇచ్చి మీరు ఈ సమాజం మీద వదిలేసారు. ఎవరి జీవితాలు ఏమైపోతే ఏమి? మాకు కావాల్సిన డబ్బు అనే ఉద్దేశంతో వెళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇక నేను కూడా చాలా కష్టపడుతున్నాను. మాటీవీలో మీరు విహారి అనే ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి తీసేసారు. ఎందుకంటే ట్రావెలింగ్ కష్టమని. నేను ఈరోజు వరకు కొత్తిమీర కట్ట కూడా ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే నన్ను ఈ స్థాయిలో నిల్చని పెట్టిన వారిపట్ల నాకు కృతజ్ఞతా భావం ఉంది. కానీ మీరు ప్రమోట్ చేసిన కంటెస్టెంట్లకి ఎవరికీ ఇది లేదు. మీ నాన్నగారి పట్ల నాకు మంచి గౌరవం ఉంది. తెలుగు చిత్ర సీమకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు లాంటివారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లి కొద్దిపాటి మచ్చని తెచ్చుకున్నారు. కానీ మీ నాన్నగారు మచ్చలేని చంద్రుడు. చివరి వరకు చాలా బాగా బ్రతికారు. మీ నాన్నగారు సినిమాలోని నేను చూస్తూ ఉంటా.ఈ మాటలన్నీ చెప్పుకొస్తూ వీడియో మొదట్లో చెప్పినట్లు కర్త కర్మ క్రియ అన్ని నాగార్జున అంటూ మరోసారి చివర్లో గుర్తు చేశాడు అన్వేష్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×