BigTV English
Advertisement

OTT Movie : రిచ్ లైఫ్ కి అలవాటు పడే అమ్మాయిలు … నరకం చూపించే అబ్బాయిలు

OTT Movie : రిచ్ లైఫ్ కి అలవాటు పడే అమ్మాయిలు … నరకం చూపించే అబ్బాయిలు

OTT Movie : ఓటిటిలో ఎంతోమంది జీవితాలకు సంబంధించిన డాక్యుమెంటరీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు పైకి కనిపించే మెరుపుల కన్నా లోపల ఉండే చీకటి కోణాన్ని లోతుగా చూపిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే డాక్యుమెంటరీలో అందమైన అమ్మాయిలకు రిచ్ లైఫ్ చూపించి, వాళ్లను పో*ర్నోగ్రఫీకి వాడుకునే, చీకటి వ్యాపారం గురించి చూపించారు. ముఖ్యంగా ఇవి ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంటాయి. చివరికి వాళ్ళ జీవితాలు ఊహించని విధంగా ఉంటాయి. వీళ్లను పూర్తిగా వాడుకున్నాక పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. వీటికి సంబంధించి ఒక స్టోరీని డాక్యుమెంటరీగా తీశారు. ఈ స్టోరీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? పేరు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ అమెరికన్ డాక్యుమెంటరీ మూవీ పేరు ‘హాట్ గర్ల్స్ వాంటెడ్’ (Hot Girls Wanted). 2015 లో విడుదలైన ఈ సినిమాకి జిల్ బాయర్, రోన్నా గ్రాడస్ దర్శకత్వం వహించారు. రషీదా జోన్స్ దీనిని నిర్మించారు. ఈ మూవీ అమెచ్యూర్ పో*ర్న్ ఇండస్ట్రీలోకి ప్రవేశించే 18-19 ఏళ్ల యువతుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇది 2015 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయ్యింది. 2015,మే 29 నుంచి నెట్ ఫ్లిక్స్ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఈ డాక్యుమెంటరీ, రాచెల్ బెర్నార్డ్, ట్రెస్సా సిల్గురో, కార్లీ స్టౌఫర్ వంటి యువతులను అనుసరిస్తుంది. వీరు 23 ఏళ్ల పోర్న్ ఏజెంట్ రిలే రేనాల్డ్స్ ద్వారా నార్త్ మయామి బీచ్‌లోని అతని ఇంటిలో రిక్రూట్ చేయబడతారు. ‘హాట్ గర్ల్స్ వాంటెడ్’ అనే ప్రకటనల ద్వారా ఉచిత విమాన టికెట్‌లు, గ్లామరస్ జీవనశైలి వాగ్దానాలతో యువతులు ఈ రంగంలోకి ఆకర్షిస్తారు. అయితే, ఈ ఇండస్ట్రీలోని కఠిన వాస్తవాలు లోతులోకి పోయిన తరువాతే తెలుస్తాయి. ఇక్కడ 3 నెలలు కన్నా ఎక్కువగా ఉంచుకోరు.ఇంతలోనే ఇక్కడికి వచ్చిన అమ్మాయిలకు ఆర్థిక అస్థిరత, మానసిక ఒత్తిడి వారి జీవితాలను కోలుకోలేని విధంగా ప్రభావితం చేస్తుంది. వాస్తవంగా, ఒక యువతి మూడు నెలల్లో $25,000 సంపాదించినప్పటికీ, ఖర్చుల తర్వాత కేవలం $2,000 మాత్రమే మిగిలిందని తెలుస్తుంది.

ఆతరువాత ఈ యువతులు ఎదుర్కొనే అవమానాలు, ఒత్తిడి, కుటుంబ సంబంధాలపై ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. వాస్తవాలు తెలుసుకుని కొందరు ఈ రంగాన్ని వదిలి వెళ్లిపోయి, తమ కుటుంబాలతో కలవడానికి ప్రయత్నిస్తారు. మరికొంతమంది ఏటూ పోలేక ఒంటరి జీవితాలకు అలవాటుపడుతుంటారు. ఈ మూవీ యువతుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసిందని, సెక్స్ వర్కర్ల గోప్యతను ఉల్లంఘించిందని కొందరు ఆరోపించారు. సెక్స్ వర్కర్లు ఈ డాక్యుమెంటరీని, ఇండస్ట్రీని చెడుగా చిత్రీకరించే అజెండాగా భావించారు. మొత్తానికి ‘హాట్ గర్ల్స్ వాంటెడ్’ ఒక వివాదాస్పద డాక్యుమెంటరీగా పేరు తెచ్చుకుంది. వాస్తవాలు తెలీకుండా ఇటువంటి వాటికి, రోజూ ఎంతో మంది యువతులు బలి అవుతున్నారు. వాస్తవాలు తెలుసుకునే లోపు జీవితాలు గల్లంతవుతాయి.

Read Also : ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అదిరిపోయే ట్విస్ట్ … ప్రియుడు ఉండాగానే మరొకరితో రొమాన్స్ … ఏం బో*ల్డ్ సీన్స్ రా సామి

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×