Devakatta : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులలో ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉన్న వ్యక్తి దేవకట్ట. వెన్నెల సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు. దేవకట్ట తీసిన ప్రస్థానం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. చాలామందికి ఆ సినిమా విపరీతంగా నచ్చింది. మామూలుగా ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చటం వేరు. కానీ చాలామంది సినిమా దర్శకులు కూడా ఇంప్రెస్ అయ్యేలా ఆ సినిమాను తెరకెక్కించాడు దేవకట్ట. ముఖ్యంగా ఆ సినిమాలో దేవకట్ట రాసిన కొన్ని డైలాగ్స్ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. సాయికుమార్ పాత్రను డిజైన్ చేసిన విధానం “ఒక్కసారి ఆ పురాణాలన్నీ దాటించి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప, హీరోలు విలన్లు లేరి నాటకంలో ” అని సాయికుమార్ చెప్పే డైలాగ్ ఇవన్నీ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. ఇప్పటికీ ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఇంత గొప్పగా ఎలా తీశాడు అని ఆశ్చర్యం కలుగుతుంది.
రిపబ్లిక్ మరో వండర్
ప్రస్థానం సినిమా తర్వాత దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆటోనగర్ సూర్య. నాగచైతన్య సమంత కలిసి నటించిన ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. మామూలుగా కొన్ని సినిమాల్లో డైలాగులు ఉంటాయి కానీ దేవకట్ట సినిమాల్లో తన ఆలోచనలే డైలాగుల్లో వినిపిస్తాయి. తన మాటలతో ఈ సమాజాన్ని ప్రశ్నిస్తుంటాడు. ఇక దేవకట్ట నుంచి వచ్చిన లాస్ట్ సినిమా రిపబ్లిక్. సాయి ధరం తేజ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా చాలామందిని ఆలోచించ గలిగేలా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలు సాయి తేజ నటించిన తీరు చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం దేవకట్ట మయసభ అనే ఒక సిరీస్ చేస్తున్నారు.
మయసభ లో ఆ యాక్టర్ లేడు
దేవకట్ట చేస్తున్న మయసభ అప్డేట్ అందించాడు. ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను మయసభ షూటింగ్ పూర్తి అయిపోయింది. ప్రస్తుతం ఫైనల్ సౌండ్ మిక్సింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, నాజర్, దివ్య దుత్త, తన్య రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ అయ్యంగర్, శత్రు వంటి నటులు కీలకపాత్రను పోషిస్తున్నారు. కొంతమంది చైతన్య రావు పేరుకు బదులుగా నాగచైతన్య పేరుని కొన్ని వార్తలలో రాస్తున్నారు. అంటూ క్లారిఫికేషన్ ఇచ్చారు దేవకట్ట. ఈ సిరీస్ గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నట్లు తెలిపారు.
Also Read :Hit 3 Pre – Release Event: అర్జున్ సర్కార్ కోసం జక్కన్న.. ఇది కదా అసలైన వేడుకంటే..?