DSC Free Coaching: ఏపీలోనీ డీఎస్సీ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. రాష్ట్రంలోని బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన డీఎస్సీ అభ్యర్థుల కోసం ఆన్ లైన్‌లో ఫ్రీగా క్లాసెస్ నిర్వహిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. సచివాలయం వేదికగా మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో, శ్యామ్ ఇన్ స్టిట్యూట్ రూపొందించిన ఆచార్య యాప్ ద్వారా ఈ శిక్షణను అందించనున్నట్టు మంత్రి తెలిపారు. అభ్యర్థులు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినయోగం చేసుకోవాలని తెలిపారు. ఈ ఆన్ లైన్ కోచింగ్ 24 గంటల పాటు అభ్యర్థులకు అందుబాటులో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సిటీకి వెళ్లి కోచింగ్ తీసుకోని వారికి ఇది మంచి అవకాశం అని చెప్పారు.
చాలా మంది నిరుపేద అభ్యర్థులు, ఇంట్లో ఉండే మహిళ అభ్యర్థులు, సుదూర ప్రాంతాల్లో నివసించే వారికి, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారు డబ్బులు కట్టి ఆఫ్ లైన్ లో క్లాసెస్ వినేందుకు ఇబ్బంది పడుతున్నారని.. అలాంటి వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా ఫ్రీ గా క్లాసెస్ వినేందుకు వీలు ఉంటుందని ఆమె చెప్పారు.
Also Read: WBPDCL Recruitment: టెన్త్, ఇంటర్ పాసైతే చాలు భయ్యా.. అప్లై చేసుకోవచ్చు.. జీతమైతే నెలకు రూ.94,000
ఇలాంటి మంచి అవకాశాన్ని డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉపయోగించుకుంటారని భావిస్తున్నట్టు మంత్రి సవిత తెలిపారు. ట్రైనింగ్ టైంలో అర్హులైన అభ్యర్థులకు నెలకు రూ.1500 చొప్పున స్టైఫండ్, బుక్స్ కొనగోలు నిమిత్త మరో వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ లో అత్యంత అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకుల బోధనలు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్స్, గతంతో జరిగిన డీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా అందుబాటులో ఉంచుతామని మంత్రి సవిత చెప్పారు. క్లాసెస్ ఏరోజుకు ఆ రోజు వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఉద్యోగం సులభం అవుతోందని మంత్రి పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. శామ్ ఇన్‌స్టిట్యూట్ కు ఈ రంగంలో విస్తృతమైన అనుభవం ఉందని, సీనియర్ ఫ్యాకల్టీలు అందుబాటు ఉన్నారని చెప్పారు. అందుకే ఈ బాధ్యతను శామ్ ఇన్ స్టిట్యూట్ వారికి అప్పగించినట్లు మంత్రి సవిత తెలిపారు.
Also Read: NMDC Recruitment: డిగ్రీ అర్హతతో 934 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.1,70,000 జీతం