Aye Jude Vs Anvesh : మహిళల వస్త్రధారణ పై శని నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యలను తప్పుపడుతూ ప్రముఖ యూట్యూబ్ నా అన్వేషణ అన్వేష్ వీడియోని షేర్ చేశారు.. అందులో హిందూ దేవుళ్ళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. ఇప్పటికే అన్వేష్ పై పోలీస్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఎన్ని కేసులు నమోదైన ఐ డోంట్ కేర్ అంటూ అన్వేష్ మరోసారి వీడియోలతో రెచ్చిపోతున్నాడు. తాజాగా ఆయన న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. ఇదిలా ఉండగా ప్రముఖ యూట్యూబ్ అజయ్ అన్వేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అతనికి అన్వేష్ కౌంటర్ ఇచ్చాడు.. వీరిద్దరూ ఈ హెచ్చరికలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. అజయ్ ఏమన్నాడు? దానికి అన్వేష్ ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మహిళలకు స్వేచ్ఛ ఉండాలి అని అన్వేష్ వీడియోలో అంటాడు. అంతవరకు బాగానే ఉన్నా కూడా ఆ తర్వాత శ్రీరాముడు గురించి సీతమ్మ తల్లి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఒక హిందువు అయ్యుండి హిందూ దేవుళ్ళ మీద ఇలాంటి నీచపు మాటలు మాట్లాడడం నీకు కొంచెం కూడా సిగ్గు లేదా అంటూ కొందరు హిందూ సంఘాల సభ్యులు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్వేష్ కు వ్యతిరేకంగా పోలీస్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి.. తాజాగా ప్రముఖ యూట్యూబ్ అజయ్ నాన్ వెజ్ పై మండిపడుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో అజయ్ ఆ రాముడిని ఏమైనా అంటే కొడుకుల్లారా.. ఖబడ్డార్.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది అంటూ అన్వేష్ కు వార్నింగ్ ఇస్తాడు.. ఆ వీడియో పై తాజాగా అన్వేష్ స్పందిస్తాడు.. దాంతోపాటుగా మరో వీడియోని షేర్ చేస్తాడు.
Also Read : రూటు మార్చిన అన్వేష్.. బత్తాయిలను బత్తాయిలతోనే కొట్టాలి.. ఇదేం పైశాచికం..
అజయ్ చేసిన వ్యాఖ్యలపై అన్వేష్ స్పందించారు. ఆయన కూడా ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ లో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడుతూ.. అజయ్ గారు మీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. మీ గురించి నాకు పెద్దగా తెలీదు. నా గురించి మాట్లాడిన తర్వాత మీ గురించి తెలుసుకోవాలని అనుకున్నాను. అలా మీ గురించి వెతికితే బోలెడు బయటికి వచ్చాయి. ముందుగా నీ తమ్ముడు ఫణి రేప్ కేసు గురించి బయటపడింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులైన మీరిద్దరూ చేసిన పనులు ఎంత నీచంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కండోముల గురించి రివ్యూలు ఇవ్వడం నువ్వు చేసిన కంటెంట్ ఆ అని అన్వేష్ అజయ్ పై రెచ్చిపోయాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటే మాత్రం నీ బాగోతాన్ని బయట పెట్టేస్తాను. నీకు, నీ తమ్ముడు అంత చూస్తాను. మాటలు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీలాగే నేను పెయిడ్ ప్రమోషన్స్ చేసి వీడియోలు చేయటం లేదు. దేశాలు తిరిగి మరి వీడియోలు చేస్తున్నాను. నా గురించి మాట్లాడే అధికారం దమ్ము నీకు లేదు అంటూ అన్వేష్ అజయ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాదు ఆ వీడియోని వెంటనే డిలీట్ చేయకపోతే నీ బాగోతం బయట పెడతాను అంటూ హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై యూట్యూబర్ అజయ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..