2027 ODI World Cup: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సేవలు కావాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి దిగివచ్చినట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ లో ( 2027 ODI World Cup) రోహిత్ శర్మ ( Rohit Sharma) కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు కోరుతున్నారట. ప్రస్తుత పరిస్థితులలో గిల్ ఒక్కడే వన్డే వరల్డ్ కప్ జట్టును లీడ్ చేయడం చాలా కష్టం అవుతుంది అని చెబుతున్నారు. అందుకే రోహిత్ శర్మకు మళ్లీ వన్డే కెప్టెన్సీ ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గిల్ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో టీమిండియాను లీడ్ చేయడం కష్టమేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు డిసైడ్ అయ్యారట. అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కు పంపిస్తే, అట్టర్ ఫ్లాప్ కావడం గ్యారంటీ అంటూ ఓ నివేదిక బీసీసీఐ వద్దకు వచ్చిందట. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ టీమిండియా బాధ్యతలను మొత్తం తీసుకుంటేనే జట్టు విజయం సాధిస్తుందని ఈ నివేదికలో కీలక అంశం ఉందట.
ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ కాళ్లు పట్టుకొని అయినా మళ్లీ కెప్టెన్సీ అతనికి ఇవ్వాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే రోహిత్ శర్మతో అత్యవసర సమావేశం కూడా నిర్వహించనున్నారట. ఈ సమావేశంలో కెప్టెన్సీ ఆఫర్ కూడా చేయబోతున్నారట. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే, కచ్చితంగా టీమిండియా టైటిల్ గెలవడం గ్యారెంటీ అంటున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఫైనల్ దాకా జట్టును తీసుకువెళ్లాడు రోహిత్ శర్మ. ఇప్పుడు కూడా అదే తరహాలో అతడు రాణిస్తాడని.. ప్రస్తుత ఫామ్ బట్టి చూస్తే అతడు అదరగొట్టడం గ్యారంటీ అంటున్నారు.
గత ఏడాదికాలంగా గిల్ రాణించిన దాఖలాలు లేవు. ఏ మ్యాచ్ చూసిన సరే.. పది పరుగులు లేదా డక్ ఔట్ కావడం చూస్తున్నాం. అందులోనూ గాయాలు అతన్ని వెంటాడుతున్నాయి. అందుకే టి20 ప్రపంచ కప్ నుంచి గిల్ పేరును తొలగించారు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లో కూడా అతనికి ప్రాధాన్యత తగ్గించాలని బీసీసీఐ చూస్తోంది. ఇందులో భాగంగానే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి భారత క్రికెటర్ నియంత్రణ మండలి ( BCCI) ఇస్తోన్న ఈ ఆఫర్ పై రోహిత్ శర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.