BigTV English

Rajadhani Files Movie : ‘రాజధాని ఫైల్స్‌’ .. రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్..‌

Rajadhani Files Movie : ‘రాజధాని ఫైల్స్‌’ .. రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్..‌

Rajadhani Files Movie Release News Updates : తీవ్ర వివాదం రేపిన రాజధాని ఫైల్స్ మూవీ రిలీజ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది.


ఏపీ రాజధాని అమరావతి పరిస్థితుల నేపథ్యంతో తీసిన ఈ సినిమాపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. సీఎం వైఎస్ జగన్ , ఏపీ ప్రభుత్వ పరువును దిగజార్చేందుకు ఈ మూవీని తీశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది డిసెంబర్ 18న ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. సీబీఎఫ్ సీ జారీ చేసిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Read More: ఏం డ్యాన్స్ చేసింది మామా.. ఎక్కడ చూసినా ఆమె రీల్సే.. దెబ్బకు OY డైరెక్టరే ఫిదా..


వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఫిబ్రవరి 13న హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా ప్రదర్శన తాత్కాలికంగా నిలిపివేయాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో ఈ చిత్ర ప్రదర్శన ఆగిపోయింది.

గురువారం విజయవాడ, గుంటూరు జిల్లాల్లో రాజధాని ఫైల్స్ ప్రదర్శిమవుతున్న థియేటర్ల వద్ద వైసీపీ నేతలు ఆందోళనలు చేశారు. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయించారు. ఈ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హైకోర్టు ఆదేశాలతో రాజధాని ఫైల్స్ మూవీని గురువారం సినిమా నిర్మాతలు నిలిపివేశారు. హైకోర్టు తుది తీర్పు కోసం వేచి చూశారు.

తాజాగా శుక్రవారం రాజధాని ఫైల్స్ మూవీపై హైకోర్టులో తిరిగి వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలను విన్న ఏపీ హైకోర్టును సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజధాని ఫైల్స్ మూవీ ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శనమవుతోంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×