BigTV English

OY ReRelease : ఏం డ్యాన్స్ చేసింది మామా.. ఎక్కడ చూసినా ఆమె రీల్సే.. దెబ్బకు OY డైరెక్టరే ఫిదా..

OY ReRelease : ఏం డ్యాన్స్ చేసింది మామా.. ఎక్కడ చూసినా ఆమె రీల్సే.. దెబ్బకు OY డైరెక్టరే ఫిదా..
entertainment news today

Young woman Mass dance for OY songs in Theatre(Entertainment news today): వాలెంటైన్స్ డే సందర్భంగా రీ-రిలీజ్ అయిన చిత్రాల్లో ఓయ్(OY) మూవీ ఒకటి. పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమా కూడా రీ రిలీజ్ అవ్వగా.. ఈసారి మాత్రం ఓయ్ హవానే కనిపిస్తోంది. ఇన్ స్టా లో ఎక్కడ చూసినా ఓయ్ సినిమా రీల్సే కనిపిస్తున్నాయి. వాటన్నింటిలో ఎక్కువగా.. ఓ అమ్మాయి ఓయ్ మూవీలో పాటలన్నింటికీ వైజాగ్ సంగం శరత్ థియేటర్ లో చేసిన డ్యాన్స్ రీల్సే విపరీతంగా వైరల్ అవుతున్నాయి.అది కూడా చీరలో.. ఫుల్ ఎనర్జీతో ఆమె డ్యాన్స్ చేయడం అందరినీ కట్టిపడేసింది. నెమలి నాట్యమాడుతుందా అన్నట్లు డ్యాన్స్ చేసిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక్క రోజులో ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు. అనుకోలేదేనాడు, ఓయ్ ఓయ్ పాటలకు ఆమె వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


ఇక మీమర్స్ ఊరికే ఉంటారా మరి. ఆ అమ్మాయి డ్యాన్స్ వీడియో పై మీమ్స్ క్రియేట్ చేసి.. పోస్టులు మీద పోస్టులు చేస్తూనే ఉన్నారు. “వచ్చిందమ్మ క్యూటీ, ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, పాప ఐడీ దొరికేసిందిరోయ్, ఎంత ఆనందం వేసుంటే అంతమంది అబ్బాయిల్లో ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుందిరా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఎవర్రా ఈ అమ్మాయి ఇంత క్యూట్ గా ఉంది, నెమలి నాట్యం చేస్తున్నట్లుంది, ఎవర్రా ఈ ఏంజెల్ మైండ్ లో నుంచి పోవట్లేదు, వన్ డే లో వైజాగ్ స్టార్ అయిపోయింది, ఓయ్ రీ రిలీజ్ ఒక లెవల్ అయితే.. ఆమె డ్యాన్స్ ఇంకో లెవల్, కూచిపూడి టీచర్ అంట.. అర్జెంటుగా అప్పు చేసైనా జాయిన్ అయిపోవాలి. నెక్ట్స్ ఓయ్-2 మూవీకి ఈ పాపను హీరోయిన్ గా తీసుకోవచ్చుగా” అంటూ ఆమె డ్యాన్స్ వీడియో పై మీమ్స్ చేస్తూ ఇంకా వైరల్ చేస్తున్నారు.

Read More : సినిమా స్టార్ల క్రికెట్ టోర్నీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?


ఆమె డ్యాన్స్ వీడియో.. ఓయ్ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగ వరకూ చేరడంతో.. ఏకంగా ఆయనే ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో డైరెక్టర్ గా మెసేజ్ చేశారు. ఇంక పాప ఆనందానికి అవధుల్లేవు. హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా స్టెప్పులేస్తూ.. ఆ ఒక్క థియేటర్లో ఉన్న వారినే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఓయ్ లవర్స్ అందరినీ ఓ ఊపు ఊపేసింది. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదూ. మౌనిక పట్నాయక్.

oy rerelease dance girl

ఎంబీఏ చదివిన 23 ఏళ్ల మౌనిక పట్నాయక్.. కూచిపూడి డ్యాన్స్ టీచర్ కూడా. బెస్ట్ టాలెంట్ ఆఫ్ మిస్ విశాఖ 2023 విజేత. గతేడాది డిసెంబర్ లో భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో.. కూచిపూడి కళావైభవం పేరిట జీఎంసీ బాలయోగి స్టేడియంలో 3782 మంది కళాకారులతో కలిసి నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ పిల్లలు చేసిన కూచిపూడి నృత్యంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అవార్డు కూడా పొందిందామె. ఏదేమైనా ఒక్క ఓయ్ డ్యాన్స్ తో వన్ డే లో వైజాగ్ స్టార్ అయిపోయింది మౌనిక పట్నాయక్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×