AR Rehman : ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి జనాల్లో నెలకొంది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల వైపు అడుగులు వేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా జరుగుతుంది. గత కొన్ని నెలల్లో ఎంతో మంది విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో సెలబ్రేటి జంట వచ్చి చేరింది.. ఈయన ఒక లెజండరి డైరెక్టర్.. సమాజంలో బాగా పేరు ఉన్న వ్యక్తి. ఆస్కార్ విజేత కూడా.. ఆయన ఎవరో కాదు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.. ఇదేం ట్విస్ట్.. ఆయన పెళ్ళై ముప్పై ఏళ్లు కావొస్తుంది. ఈ వయస్సులో విడాకులు తీసుకోవడానికి బలమైన కారణం ఉంటుంది. మరి ఆ కారణం ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆస్కార్ విజేత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఏఆర్ రెహమాన్ గురించి తెలియని భారతీయుడు ఉండడు.. ప్రతి భాషలో ఈయన కంపోజ్ చేసిన పాటలు బాగా ఫెమస్ అయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నో ఏళ్లుగా సంగీత ప్రపంచంలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని చక్రం తిప్పుతున్నారు రెహమాన్. వృత్తి పరంగా సాఫిగానే సాగుతున్న ఆయన జీవితంలో దాంపత్య జీవితాన్ని సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేకపోయారని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఈ వయస్సులో విడాకులు ఏంటి అనే సందేహం కూడా రావొచ్చు. అసలు ఏమైందో ఒకసారి చూద్దాం..
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. మంగళవారం రాత్రి, ఆమె ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంపై సినీ వర్గాలు సైతం షాక్ కు గురయ్యాయి. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈయన 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. ఏ. ఆర్. రెహమాన్‌కి మొత్తం ముగ్గురు పిల్లలు. రెహమాన్ పెద్ద కూతురు. ఆమె కూడా సంగీత రంగం లోకి అడుగు పెట్టింది. రెహమాన్ గారి రెండవ కూతురు కీబోర్డ్ వాయిస్తుంది. రెహమాన్ కుమారుడు కూడా సంగీత రంగంలో చురుగ్గా ఉంటారు. 29 ఏళ్ల పాటు సాగిన వారి వివాహ బంధం విడాకులతో ముగిసినట్టు అయింది.. అసలు ఇన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటా అనేది అందరి మనసును తొలిచి వేస్తుంది.. దీనికి గల కారణం ఏంటో రెహమాన్ అన్న చెబుతారేమో చూడాలి.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ టాపిక్ హాట్ టాపిక్ అవుతుంది..