Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారో, కానీ అప్పటినుంచి ఒక సమస్య మించి మరో సమస్య వస్తూనే ఉన్నాయి. వకీల్ సాబ్ సినిమాను ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ఆ డిజైన్ చేసినా కూడా, అప్పుడు ఉన్న టిక్కెట్ రేట్ల వలన ఆ సినిమా కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ కూడా కానీ పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బీమ్లా నాయక్, బ్రో సినిమాలకు టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వలన ఊహించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇక ప్రస్తుతం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా కొన్ని పరిస్థితుల్లో అనుకూలించడం లేదు. ఇప్పుడు కొత్తగా థియేటర్ల సమస్య మొదలైంది. అయితే ఈ సమస్యను కావాలనే కొంతమంది ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చారు అంటూ సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి.
ఎగ్జిబిటర్లకు ఫోన్ చేసింది ఎవరు?
క్రిస్మస్ కి ముందు, సంక్రాంతి సమయంలోనూ, ఇప్పటి వరకూ లేని థియేటర్ల అద్దె, పర్సంటేజీ సమస్యను ఇప్పుడు తెర మీదకు తెచ్చింది ‘ఆ నలుగురు’లో ఒక వ్యక్తి. బాధ్యతయుత పదవిలో ఉన్న ఆ వ్యక్తికి సంబంధించిన సినిమాలు గత సీజన్లలో తెర మీదకు వచ్చేశాయి. ఆ సమయంలో పవన్ కల్యాణ్ నుంచి కావల్సిన సహాయ సహకారాలు పొందారు. ఏరు దాటేశారు. ఇప్పుడు ఆ వ్యక్తికి హఠాత్తుగా ఎగ్జిబిటర్ల సమస్యలు గుర్తుకువచ్చాయి. మీ సమస్యలు తీరుస్తాను రండి అని ఫోన్లు చేసి పిలిపించుకొని కథ మొదలుపెట్టారు. జూన్ 1నుంచి సినిమా హాళ్ళకు తాళాలు వేస్తామని లీకులు, అల్టిమేటంలు ఇప్పించారు.
థియేటర్ల లీజు ముగిశాక ఏం చేస్తారు?
పరిశ్రమ బాగోగుల కోసం ఆలోచన చేసిన పవన్ కల్యాణ్ కి థియేటర్ల మూత ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము అని ‘ఆ నలుగురు’ నిర్ణయించుకొన్నట్లు ఉన్నారు. తెర వెనక రాజకీయాలతో వెండి తెరపై వినోదాన్ని ప్రేక్షకులకు దూరం చేసి, నిర్మాతను, హీరోను ఇబ్బందిపెడతామూ అనుకొంటే సాధ్యమయ్యే పనేనా? ఇది సోషల్ మీడియా కాలం. ఎవరి ఆట ఏమిటో అందరికీ క్షణాల్లో వెల్లడవుతోంది. తమ సినిమాల విడుదల సమయంలో ఎవరు ఎలాంటి విన్యాసాలు చేశారో కూడా ప్రేక్షకులు, ప్రజలు మరచిపోలేదు. ‘హరిహర వీరమల్లు’ను అడ్డుకొంటున్నాము అనుకొంటున్నారు… రేపటి రోజున ‘ఆ నలుగురు’ సినిమాలు కూడా వస్తాయి. అప్పుడూ ఇలాంటి సమస్యలే వస్తే ఏమి చేస్తారు? థియేటర్లు తమ చేతుల్లో ఉన్నాయని ఆటాడుతున్న వాళ్ళు రేపటి రోజున లీజుల గడువు ముగిశాక కూడా -ఆ హాళ్ళు తమవే అనుకొంటే పొరబాటే. అసలు యజమానులే రంగంలోకి వచ్చాక, కథ ఎలా మలుపులు తిరుగుతుందో ఊహించగలరా? ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Received these. #TeluguCinema pic.twitter.com/IcnBmHDh3g
— Jalapathy Gudelli (@JalapathyG) May 23, 2025