Visakha Flying Cars: గాల్లో ఎగిరే కార్లు అంటే ఒకప్పుడు సినిమాల్లో చూసిన విజువల్స్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు, విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఈ కలలు నిజం కాబోతున్నాయి. 2075 నాటికి గగన మార్గాల్లో వాహనాలు తిరిగే రోజులు ఎంతో దూరంలో లేవు. టెక్నాలజీ పెరుగుతున్న వేగాన్ని చూస్తుంటే, గాల్లో కార్లు అనే పదాన్ని వినటం ఇక ఆశ్చర్యంగా అనిపించకపోవచ్చు.
విశాఖ స్మార్ట్ సిటీ..
ఏపీలోని ప్రధాన నగరాలలో ఒకటిగా గుర్తించబడ్డ విశాఖ నగరం ఇప్పుడు అభివృద్ది పథంలో సాగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో విశాఖ మహా నగరంగా రూపుదిద్దుకొనే చర్యలు మొదలయ్యాయి. మెట్రో నగరంగా మారే రోజులు సమీపించిన సమయంలో విశాఖ నగరంపై అందరి అంచనాలు అధికమయ్యాయి. ఎటు చూసినా భారీ పరిశ్రమలు కనిపించే నగరంగా భవిష్యత్ లో విశాఖ ప్రపంచ పటంలో కనిపించనుంది. అయితే భవిష్యత్ లో విశాఖ నగరం ఒక రోల్ మోడల్ సిటీగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు.
50 ఏళ్లలో..
ఇప్పటికే స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం, రాబోయే 50 ఏళ్లలో భారతదేశంలోనే కాకుండా, ఆసియా ఖండంలో ఒక ప్రిమియర్ మెగా సిటీగా ఎదగబోతోందన్నది నిపుణుల అంచనా. సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల విస్తరణ, జీవన నాణ్యత అన్నిటిలోనూ విశాఖ కొత్త ప్రమాణాలు నెలకొల్పబోతోంది. 50 ఏళ్లలో, విశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కలిగిన నగరంగా మారనుంది. ట్రాఫిక్ లైట్స్ నుండి గార్బేజ్ మేనేజ్‌మెంట్ వరకూ అన్నీ ఆటోమేటెడ్ అవుతాయి. మెట్రో, ఎలెక్ట్రిక్ బస్సులు, డ్రైవర్‌లెస్ వాహనాలు సాధారణమవుతాయి.
50 ఏళ్లలో, విశాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పని చేసే ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కలిగిన నగరంగా మారనుంది. ట్రాఫిక్ లైట్స్ నుండి గార్బేజ్ మేనేజ్‌మెంట్ వరకూ అన్నీ ఆటోమేటెడ్ అవుతాయి. మెట్రో, ఎలెక్ట్రిక్ బస్సులు, డ్రైవర్‌లెస్ వాహనాలు సాధారణమవుతాయి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేస్తే, విశాఖ గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకోవచ్చు. సాలార్ ఎనర్జీ ఆధారిత గృహాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, నగరంలో గ్రీన్ కారిడార్లు, వాయు నాణ్యత మానిటరింగ్ సిస్టమ్‌లు ఉంటాయి.
గాల్లో ఎగిరే కార్లు… ఊహ కాదు, భవిష్యత్ నిజం
2075 నాటికి విశాఖలో Flying Cars (గాల్లో ఎగిరే కార్లు) సాధ్యమే కాకుండా, ప్రత్యేక వాణిజ్య గగన మార్గాల్లో తిరిగే స్కై టాక్సీలు అందుబాటులోకి రావచ్చు. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో eVTOL (Electric Vertical Takeoff and Landing) వాహనాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి. రుషికొండ నుంచి సిటీ సెంటర్ వరకు మినిట్లలో ప్రయాణించేందుకు స్కై టర్మినల్స్ ఉపయోగపడే రోజులు రానున్నాయని చెప్పవచ్చు. ఇవి హెలికాప్టర్ మాదిరిగానే నేరుగా గాల్లోకి లేచి, మెట్రో టికెట్ ధరలకే ప్రయాణించగలిగే కార్లు. వీటికి పెట్రోల్ అవసరం లేదు, పైలట్ అవసరం లేదు, ట్రాఫిక్ లేనే లేదు – కేవలం డిజిటల్ మ్యాప్‌లో గమ్యస్థానం చూపిస్తే సరిపోతుంది.
Also Read: Digital ration card AP: రేషన్ కార్డు ఇక స్మార్ట్ కార్డు.. ఆ ఆటలు సాగవు.. ఎందుకంటే?
విశాఖకు ఎగిరే కార్లు వస్తే..
విశాఖలో ఇప్పటికే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, టెక్ హబ్, గ్రిన్ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2075 నాటికి కొన్ని వినూత్న మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. బీచ్ రోడ్, NAD, గాజువాక వంటి కీలక ప్రాంతాల్లో స్కై టర్మినల్స్ స్కై టాక్సీ స్టేషన్లు, విమానాశ్రయం తరహాలో కార్లకూ రూట్ నియంత్రణ, GPS కన్నా అత్యంత ఖచ్చితమైన గగన నావిగేషన్ సిస్టమ్ నగరానికి పరిచయం కానుంది. ఈ కార్లు టోటల్ ఎలక్ట్రిక్ కాబట్టి శబ్ద కాలుష్యం లేదు, గాలి కాలుష్యం లేదు. విశాఖ ఇప్పటికే పచ్చదనం మీద దృష్టి పెడుతుండగా, గాల్లో కార్లు ఆ దిశగా మరింత పటిష్టంగా దోహదం చేస్తాయి.
విశాఖలో ఎగిరే కార్లు అన్న మాట వినగానే ఫ్యాంటసీగా అనిపించొచ్చు. కానీ అది ఇక నిజం కావడానికి బలమైన అడుగులు పడుతున్నాయి. 2075 నాటికి మనం చూసే విశాఖ మరో యుగానికి చెందినదిగా అనిపించొచ్చు. గగన మార్గాల్లో ప్రయాణించే భవిష్యత్తు నగరంగా.. ఈ మార్పులో మనం భాగస్వాములమవ్వడమే నిజమైన అభివృద్ధి అని చెప్పవచ్చు. మొత్తం మీద విశాఖ నగరం రాబోయే రోజుల్లో సింగపూర్ సిటీని మించిన సిటీ కానుందని చెప్పవచ్చు.