E-Paper
Advertisement

Arthana Binu: హీరోయిన్‌కు తండ్రి బెదిరింపులు.. వీడియో వైరల్..

Arthana Binu: హీరోయిన్‌కు తండ్రి బెదిరింపులు.. వీడియో వైరల్..
Advertisement

Arthana Binu: ఒక స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న తర్వాత హీరోలకు మాత్రమే కాదు హీరోయిన్లకు కూడా బయటవారి నుండి బెదిరింపులు వస్తూ ఉంటాయి. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం సినీ పరిశ్రమలో ఫేమ్‌ను దక్కించుకున్న తర్వాత ఇంట్లో వారి నుండి ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలుపెట్టారు. తాజాగా ఒక మలయాళ భామ కూడా ఈ లిస్ట్‌లోకి యాడ్ అయ్యింది. తన తండ్రి తనను బెదిరింపుకు గురిచేస్తున్నాడంటూ ఏకంగా ఒక వీడియోనే విడుదల చేసింది.

కేరళలో పుట్టి పెరిగిన ఆర్తనా బిను.. మొదట్లో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఉండేది. అలా తనకు తన మొదటి సినిమా అవకాశం వచ్చింది. అది కూడా తెలుగులో. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే సినిమాతో హీరోయిన్‌గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఆర్తనా. ఆ తర్వాత తనకు తెలుగులో అవకాశాలు రాకపోయినా.. కోలీవుడ్, మాలీవుడ్ మాత్రం తనను గుర్తించి అక్కడ అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. చేసింది తక్కువ సినిమాలే అయినా తన క్యూట్‌నెస్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఆర్తనా.

Advertisement

తమిళంలో జీవీ ప్రకాశ్, శశికుమార్ వంటి నటులతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆర్తనా. అయితే ఆర్తనా తండ్రి విజయ్ కుమార్ కూడా సినీ పరిశ్రమకు చెందినవాడే. ఆయన మలయాళంలో వందకు పైగా చిత్రాల్లో నటించారు. అదే సమయంలో బిందు డేనియల్‌ను పెళ్లి చేసుకున్నారు. కానీ ఆర్తనా చిన్నపిల్లగా ఉన్నప్పుడే విజయ్ కుమార్, బిందు విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత నుండి ఆర్తనా తల్లితో, అమ్మమ్మతోనే కలిసి ఉంటుంది.

విడాకులు తర్వాత తన కుటుంబాన్ని తన తండ్రి ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని ఆర్తనా బయటపెట్టింది. అంతే కాకుండా తాజాగా విజయ్ కుమార్.. ఆర్తనా ఇంటికి వెళ్లి గొడవ చేసిన వీడియోను సోషల్ మీడియా ద్వారా అందరి ముందు పెట్టింది. విజయ్ కుమార్‌పై తాను పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వారు ఏ విధంగా స్పందించడం లేదని ఆర్తనా వాపోయింది. ఇప్పటికైనా వారు స్పందించాలని కోరింది. గత కొన్నిరోజులుగా తన తండ్రి బెదిరింపులు ఎక్కువయిపోయాయని చెప్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×