BigTV English

Asin: అసిన్ భర్త చేసిన తప్పు.. రూ .1000 కోట్లకు పైగా నష్టం..!

Asin: అసిన్ భర్త చేసిన తప్పు.. రూ .1000 కోట్లకు పైగా నష్టం..!

Asin: ప్రముఖ నటి అందాల తార అసిన్ (Asin ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు తన అందంతో, అమాయకత్వంతో తెలుగు ఆడియన్స్ ను సొంతం చేసుకున్న ఈమె.. అదే క్రేజ్ తో పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన అసిన్.. కెరియర్ పీక్స్ లో ఉండగానే మైక్రోమ్యాక్స్ సంస్థ యజమాని రాహుల్ శర్మ (Rahul Sharma) ను వివాహం చేసుకొని, కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. అయితే ఈమె భర్త చేసిన తప్పు కారణంగా సుమారుగా రూ.1000 కోట్ల పైగా నష్టాన్ని ఎదుర్కొన్నారట. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.


ఐదు సంవత్సరాలలో రూ.12 వేల కోట్లు నష్టం..

ఐదు సంవత్సరాలలో రూ.12 వేల కోట్ల ఆదాయం నుండి మైక్రోమ్యాక్స్ సంస్థ ఎలా పతనమయిందో ఈ సంస్థ యజమాని నటి అసిన్ భర్త రాహుల్ శర్మ వివరించారు. మొబైల్ ఫోన్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న మైక్రోమ్యాక్స్ కి సహ వ్యవస్థాపకుడు రాహుల్. అతి తక్కువ సమయంలోనే భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయించి, అంతర్జాతీయ బ్రాండ్లతో పోటీ పడుతూ.. ఊహించని మార్కెట్ ను సొంతం చేసుకుంది. అయితే అనూహ్యంగా కొన్ని సంవత్సరాలలోనే మైక్రోమ్యాక్స్ పతనం చూడడం మొదలుపెట్టింది. చైనా బ్రాండ్ల ఆవిర్భావమే మైక్రోమ్యాక్స్ పతనానికి ప్రధాన కారణం అని రాహుల్ ఇటీవల పాల్గొన్న ఒక పాడు కాస్ట్ లో వెల్లడించారు


ఆ తప్పే మైక్రోమ్యాక్స్ పతనానికి కారణమైంది – రాహుల్ శర్మ

రాహుల్ మాట్లాడుతూ..” ప్రపంచంలోనే టాప్ 10 మొబైల్ ఫోన్ కంపెనీలలో మైక్రోమ్యాక్స్ ఒకటిగా ఉండేది..సామ్సంగ్, నోకియా వంటి బ్రాండెడ్ సంస్థల పోటీని కూడా ఇండియాలో విజయవంతంగా ఎదుర్కొని, రూ.12,000 నుండి రూ.15వేల కోట్ల వరకు ఆదాయాన్ని అందించింది. అయితే చైనా కంపెనీల రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైనా బ్రాండ్లు వచ్చిన తర్వాత మైక్రోమ్యాక్స్ బౌన్సర్ల తర్వాత బౌన్సర్లు, చివరికి క్లీన్ బౌల్డ్ అయిపోయింది ” అంటూ రాహుల్ తెలిపారు. “ఇది మైక్రోమ్యాక్స్ కే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఘటన అప్పట్లో ఎన్నో బ్రాండ్లు ఉండేవి. కానీ చైనా బ్రాండ్ల వల్లే ఇప్పుడు ఇండియాలో ఇలాంటి ఎన్నో బ్రాండ్లు కనుమరుగయ్యాయి” అంటూ రాహుల్ తెలిపారు. ఇకపోతే చైనా ఉత్పత్తిదారులు, వృద్ధి చెందుతున్న చైనా బ్రాండ్లతో మేము ఒప్పందం చేసుకోకపోవడం వల్లే కొత్త ప్రయోగాలకు అవకాశం లేకుండా పోయింది. నేను నేడు మూడు స్క్రీన్లు ఉన్న ఫోన్ తయారు చేయాలి అంటే, అందుకు అవసరమైన పరికరాలు లేకపోవడంతో అది సాధ్యం కాదు. అందుకే వ్యాపారాన్ని కొనసాగించలేము. రెండు సంవత్సరాలు ప్రయత్నించాము కానీ పెట్టుబడి పెట్టడంలో అర్థం లేదనిపించింది. పోటీదారులకు అపరిమిత నిధులు లభిస్తున్నప్పుడు మనం మన డబ్బును వృధా చేయకూడదు కదా.. చైనా కంపెనీలు పూర్తి ఆయుధాలతో వచ్చాయి. ఆ తర్వాత నిర్మాణ రంగానికి మారిపోయాయి. అయితే ఇప్పుడు మేము గతంలో కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాము కానీ ఇది చాలా మందికి తెలియని విషయం ” అంటూ రాహుల్ శర్మ తెలిపారు. ఇకపోతే రాహుల్ శర్మ , అసిన్ 2016లో వివాహం చేసుకోగా.. ఈ జంటకు అరిన్ అనే కుమార్తె జన్మించింది.

also read:Kayadu Lohar: 4 ఏళ్లలో చేసిన సినిమాలను.. 2 నెలల్లోనే బీట్ చేసిందా.. లక్ అంటే ఈమెదే..!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×