Smart Saving Tips: మీకు టీ త్రాగే అలవాటు ఉందా? రోజూ 4, 5 చొప్పున టీ త్రాగుతారా.. అయితే ఒక్క టీ డబ్బులతో లక్షలు చేతిలో ఉండే ఛాన్స్ ఉంది. అవునండీ ఇది నిజం. ఒక్క టీ డబ్బు, మీ ఇంటిల్లిపాదికి ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అయితే ఇందుకు మీరు చేయవలసిందల్లా ఒక్కటే ఆ టీ డబ్బును ఈ స్కీమ్ లో పొదుపు చేయడమే.
చిల్లరే అనుకుంటే పొరపాటే, ఈ స్కీమ్ లో ఆ డబ్బు పొదుపు చేస్తే కలిగే ప్రయోజనం వేరు. నేటి అవసరాలకు డబ్బు ఎప్పుడు అవసరమో చెప్పలేం. అందుకే ఒక్క టీ డబ్బును ఇలా చేయండి. ఇంతకు ఏంటా స్కీమ్.. ఏమిటి ఆ ప్రయోజనాలు తెలుసుకుందాం.
చాలామందికి పొదుపు చేయాలన్న ఆలోచన ఉన్నా, పెద్ద మొత్తాలు అవసరమవుతాయేమోనన్న భయం ఉంటుంది. అలాంటి వారికోసం పోస్టాఫీస్ ఒక సురక్షితమైన మార్గాన్ని అందిస్తోంది. అదే రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్. రోజుకి కేవలం ఒక టీ ధర రూ. 10 మాత్రమే కడితే సరిపోతుంది.
అసలు స్కీమ్ ఏంటి?
మనం టీవీలలో యాడ్స్ చూస్తూ ఉంటాం. అలాగే గోడలపై కూడా ఈ నినాదం చూస్తూ ఉంటాం. చిన్న మొత్తాల పొదుపు – ఇంటికి వెలుగు అని మనకు కనిపిస్తుంది. అలాంటిదే ఈ స్కీమ్. ఇది ఒక చిన్న మొత్తపు పొదుపు పథకం. నెలకు కనీసం ₹100 చెల్లిస్తూ, 5 సంవత్సరాల పాటు కొనసాగించవచ్చు. అంతేకాకుండా రోజుకి రూ. 10 చెల్లిస్తే, నెలకు రూ. 300 చెల్లించినట్లవుతుంది. ఈ డబ్బుకు వడ్డీ కలిగి, చివరికి మంచి మొత్తంగా మీరు మీ డబ్బు పొందవచ్చు.
ఈ స్కీమ్ తో ప్రయోజనాలు
చిన్న మొత్తంలో మీరు పొదుపు చేస్తే, పెద్ద స్థాయిలో ఫలితం రావడం గ్యారంటీ. రోజుకి రూ. 10 చెల్లిస్తూ పెద్ద మొత్తాన్ని జమ చేసుకోవచ్చు. 5 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి లక్ష రూపాయిలకు చేరే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ పథకాలు భారత ప్రభుత్వ గ్యారెంటీ కాబట్టి మీ డబ్బు ఇక్కడ సేఫ్. ప్రస్తుతం ఈ పథకానికి 6.7% వడ్డీ లభిస్తోంది.
లోన్ కూడా ఇస్తారు
మీరు ఆర్డీ ఖాతా ప్రారంభించిన 12 నెలల తర్వాత జమ చేసిన మొత్తం మీద మీరు నిబంధనల మేరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఈ స్కీమ్ లబ్ది కోసం కేవలం ఆధార్, ఫోటో, చిరునామా ఆధారాలతో పోస్టాఫీస్ ను సంప్రదిస్తే చాలు, మీకు స్కీమ్ ద్వారా లబ్ది పొందే అవకాశం కలుగుతుంది.
వీరందరికీ వరం
ఈ స్కీమ్ చిన్న వ్యాపారులు, ఉద్యోగస్తులు, గృహిణులు, పేద, మధ్య తరగతి ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇతర శ్రామికులకు వరమని చెప్పవచ్చు. ఇప్పటికే ఎందరో ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారు.
ఎలా ప్రారంభించాలి?
మీకు దగ్గరలోని పోస్టాఫీస్‌కి వెళ్లి Recurring Deposit ఖాతా ప్రారంభించండి. నెలకు రూ. 300 చెల్లించేలా ప్లాన్ చేసుకుంటే రోజుకి ₹10 చెల్లించినట్లే అవుతుంది. మీ RD ఖాతాకు అకౌంట్ పాస్‌బుక్ కూడా లభిస్తుంది. చిన్న మొత్తాల్లో ప్రారంభించే ఈ పథకం, ఓ మంచి భవిష్యత్తు కోసం మేలైన పెట్టుబడికి మార్గమని చెప్పవచ్చు. ఒక్క టీ డబ్బుతో మీరు లక్షల రూపాయలు పొదుపు చేయగలరు. ఇక ఆలోచించడం ఎందుకు.. పోస్టాఫీస్ కు వెళ్లండి.. స్కీమ్ ద్వారా లబ్ది పొందండి.