BigTV English

OTT Movie : ఫైట్లూ లేవు, లవ్వూ లేదు… ఐఎండీబీలో టాప్ రేటింగ్ తో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : ఫైట్లూ లేవు, లవ్వూ లేదు… ఐఎండీబీలో టాప్ రేటింగ్ తో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Movie : ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాలను, చాలామంది ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఇష్టపడుతుంటారు. ఈ సినిమాలు పాజిటివ్ థింకింగ్ తో ఎక్కువగా ఆకట్టుకుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఇండియాకి పారిపోయి వచ్చిన శ్రీలంకన్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ధర్మ దాస్ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు, మన ఫ్యామిలీలో ఇలాంటి వ్యక్తి ఒకడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


స్టోరీలోకి వెళితే

ధర్మదాస్, వసంతి అనే దంపతులకు నితుషన్, ముల్లి అనే ఇద్దరు కుమారులు ఉంటారు. ఈ ఫ్యామిలీ శ్రీలంక నుంచి పారిపోయి తమిళనాడుకు వస్తారు. భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు, భైరవన్ నేతృత్వంలోని పోలీసుల బృందం వీళ్ళను అదుపులోకి తీసుకుంటుంది. అయితే ఈ కుటుంబం మంచితనాన్ని అర్థం చేసుకుని, భైరవన్ వాళ్ళను విడిచిపెడతాడు. వసంతి సోదరుడు ప్రకాష్ సహాయంతో, ధర్మదాస్ కుటుంబం చెన్నైలోని కేసవ నగర్ కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంటుంది. ఈ ఇల్లు ఒక ఇన్‌స్పెక్టర్ రాఘవన్‌కు చెందినదని ప్రకాష్‌కు తెలిసి కాస్త భయపడతాడు. దాస్ అతని కుటుంబం శ్రీలంక నుంచి వచ్చినట్లు కాకుండా, కేరళ నుంచి వచ్చినట్లు అబద్ధం చెప్తారు. రాఘవన్ వాళ్ళ మాటలు నమ్మి ఇంటిని అద్దెకు ఇస్తాడు. తరువాత దాస్ కి టాక్సీ డ్రైవర్‌గా ఉద్యోగం దొరుకుతుంది. ఈ కుటుంబం స్థానికులతో కలిసిపోవడానికి ప్రయత్నిస్తుంది. కాలనీలో ధర్మదాస్ మంచితనానికి అందరూ దాసోహం అవుతారు.


అయితే రామేశ్వరంలో ఒక బాంబు పేలుడు జరగడంతో, పోలీసుల అనుమానం శ్రీలంకన్లపై పడుతుంది. ఇది దాస్ కుటుంబానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే దాస్ చెత్తకుప్పలో, చెత్త వేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందులోనుంచే ఆ బాంబ్ పేలి ఉంటుంది. ఇక నితుషన్ తన తండ్రి దాస్‌పై అసంతృప్తితో ఉంటాడు. ఎందుకంటే అతను తమ స్వదేశాన్ని విడిచిపెట్టి, భారతదేశంలో ఆశ్రయం పొందడానికి బలవంతంగా ఫ్యామిలీని తీసుకొస్తాడు. మరోవైపు బాంబు పేలుడు ఘటనలో పోలీసులు వీళ్లను కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. చివరికి ధర్మదాస్ ఫ్యామిలీ శ్రీలంక నుంచి పారిపోయి ఇండియాకి ఎందుకు వస్తారు ? బాంబు పేలుడు ఘటనలో ధర్మదాస్ ఫ్యామిలీ చిక్కుకుంటుందా ? కాలనీ వాళ్ళు ధర్మదాస్ ని ఎలా ట్రీట్ చేస్తారు ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : పశువుల డాక్టర్ గా బాసిల్ జోసెఫ్ … ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?

జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘టూరిస్ట్ ఫామిలీ’ (Tourist Family). 2025 లో విడుదలైన ఈ మూవీకి అబిషన్ జీవింత్ తొలి సారిగా దర్శకత్వం వహించారు. మిలియన్ డాలర్ స్టూడియోస్, MRP ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో, M. శశికుమార్, సిమ్రాన్,యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 2025 మే 31 నుంచి జియో హాట్ స్టార్ (Jio hotstar) లో అందుబాటులోకి రానుంది.

Related News

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

OTT Movie : ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన సిరీస్ లు… ఒక్కోటి ఒక్కో జానర్ లో

OTT Movie : తలపై రెడ్ లైన్స్… తలరాత కాదు ఎఫైర్స్ కౌంట్… ఇండియాలో వైరల్ కొరియన్ సిరీస్ స్ట్రీమింగ్ షురూ

OTT Movie : పిల్లోడిని చంపి సూట్ కేసులో… మైండ్ బెండయ్యే కొరియన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

OTT Movie : రెంటుకొచ్చి పక్కింటి అమ్మాయితో… కారు పెట్టిన కార్చిచ్చు… దిమాక్ కరాబ్ ట్విస్టులు సామీ

OTT Movie : అమ్మాయి ఫోన్ కి ఆ పాడు వీడియోలు… ఆ సౌండ్ వింటేనే డాక్టర్ కి దడదడ… మస్ట్ వాచ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల ముందే తల్లిపై అఘాయిత్యం… సైతాన్ లా మారే కిరాతక పోలీస్… క్లైమాక్స్ లో ఊచకోతే

OTT Movie : కాల్ సెంటర్ జాబ్ లో తగిలే కన్నింగ్ గాడు… ఫోన్లోనే అన్నీ కానిచ్చే కస్టమర్లు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Big Stories

×