Kayadu Lohar: కయాదు లోహర్ (Kayadu Lohar).. ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె, గత నాలుగు సంవత్సరాలలో చేసిన సినిమాల సంఖ్యను కేవలం రెండు నెలల్లోనే బీట్ చేసి ఆశ్చర్యపరిచింది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో చేసినా ఈమెకు గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఇటీవల డైరెక్టర్ కం హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాలో హీరోయిన్ గా నటించి, తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. ఇక ఈ సినిమా అందించిన క్రేజ్ తో తెలుగు, తమిళ్ భాషల్లో వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. అందులో భాగంగానే నాని (Nani ) హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలో ఈమెకు అవకాశం లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల (Srikanth odela) తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
మరో తెలుగు సినిమాలో అవకాశం..
అటు తమిళంలో కూడా శింబు (Simbu)తో పాటు యంగ్ హీరోలు అధర్వ(Adharva), జీవి ప్రకాష్(GV Prakash) సినిమాలలో కూడా హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ఇలా ఒకటి తరువాత ఒకటి సౌత్ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. వీటితోపాటు ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే యంగ్ డైరెక్టర్ కం హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న ‘ఫంకీ’ సినిమాలో కూడా ఈమెనే తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈమె అదృష్టం మామూలుగా లేదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ; Sailesh Kolanu: సంతోషంలోనే కాదు కష్టాల్లో కూడా.. సూపర్ హిట్ బొమ్మ షేర్ చేసిన డైరెక్టర్!
ఈ క్రేజ్ ను నేనే నమ్మలేకపోతున్నాను – కయాదు లోహర్
కెరియర్ విషయానికొస్తే.. 2021లో వచ్చిన కన్నడ చిత్రం ‘మొగిల్ పేట’ సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె, ఆ తర్వాత 2022లో శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘అల్లూరి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే ఈ సినిమాలో కయాదు నటించిన విషయం కూడా ఎవరికీ తెలియదని చెప్పాలి. ఇక తర్వాత ఇతర భాషల్లో అరడజనుకు పైగా సినిమాలు చేసినా క్రేజ్ రాలేదు. కానీ తమిళంలో ప్రదీప్ రంగనాథన్ సరసన డ్రాగన్ సినిమాలో నటించి, తన జాతకాన్నే మార్చుకుంది. గ్లామర్ తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో సత్తా చాటింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఇలా
వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” మధ్యతరగతి కుటుంబానికి చెందిన నేను చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కన్నాను. దానిని నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇక డ్రాగన్ కి ముందు ఎన్నో సినిమాలు చేసినా.. రాని గుర్తింపు ఒక డ్రాగన్ మూవీ తో రావడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. కానీ ఇప్పుడు చాలామంది నిర్మాతలు తమ సినిమాలలో చేయాలని అడుగుతున్నారు ఇంత క్రేజ్ వస్తుందని నేను కూడా ఊహించలేదు” అంటూ తెలిపింది కయాదు లోహర్. మొత్తానికైతే తెలుగు సినిమాలతో ఇప్పుడు మరింత బిజీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.