Big Stories

Avatar 2 Trailer : ‘అవతార్ 2’ ట్రైలర్… పిచ్చేక్కిస్తున్న జేమ్స్ కామెరూన్ మాయాజాలం

Avatar 2 Trailer : హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ పేరు వినగానే ఆయన తెరకెక్కించే విజువల్ వండర్స్ మనకు గుర్తుకు వస్తాయి. సినీ ప్రేమికులు ఆయన సినిమాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఆయన 2009లో తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్. దీనికి కొనసాగింపు ఉంటుందని అప్పుడే చెప్పిన జేమ్స్ కామెరూన్.. సీక్వెల్‌ను రూపొందించడానికి ఒకటి రెండు కాదు.. ఏకంగా 13 ఏళ్ల పాటు సమయం తీసుకున్నారు. అదే అవతార్ 2. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచడానికి బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే కామెరూన్ మరో విజువల్ వండర్ క్రియేట్ చేశారని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఆ విజువల్స్, మేకింగ్ చూసి నోరెళ్ల బెట్టేస్తున్నారు. మరి రేపు వెండి తెరపై ఇక సినిమా ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ట్రైలర్ విషయానికి వస్తే ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’ అనే టైటిల్ చూడగానే ఇది నీటిలో జరిగే సినిమా అని తెలుస్తుంది. నీటిలో జరిగే యుద్ధాలు.. సముద్రంలోని వింతైన జల చరాలను జేమ్స్ కామెరూన్ తన విజువల్స్‌తో అద్భుతంగా ఆవిష్కరించారు. కామెరూన్ పండోరా ప్రపంచంలోకి మరోసారి తీసుకెళ్లబోతున్నారు. డిసెంబర్ 16న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 160 దేశాల్లో విడుదలవుతుంది. మరి కలెక్షన్స్ పరంగా సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయనుందో తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

Latest News