EPAPER

ఒకప్పుడు ట్రైన్‌లో పాటలు పాడేవాడు, ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో అయిపోయాడు

ఒకప్పుడు ట్రైన్‌లో పాటలు పాడేవాడు, ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో అయిపోయాడు

ఏ సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం అనేది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. టాలెంట్ ఉన్నా కూడా సపోర్ట్ లేకపోతే, ఇండస్ట్రీలో ముందు నుండి కనెక్షన్స్ లేకపోతే ఇక్కడ ఎంటర్ అవ్వడం, అయ్యి నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని కూడా దాటి కొందరు నటీనటులు చాలామందికి ఇన్‌స్పిరేషన్ అయ్యారు. అలాంటి వారు బాలీవుడ్‌లో కూడా ఉన్నారు. అందులో ఒకడు ఆయుష్మాన్ ఖురానా. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి చాలామంది ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు ఈ యంగ్ హీరో. ఆ ఒక్క సినిమా తన జీవితాన్ని మార్చకపోయింటే ఇప్పటికీ తన టాలెంట్ ఏంటో ఎవ్వరికీ తెలిసేది కాదు.


డబ్బుల కోసం

ఏ సపోర్ట్ లేకుండా తన జీవితాన్ని తానే మార్చి రాసుకున్నాడు ఆయుష్మాన్ ఖురానా. హీరోగా ఇంత ఫ్యాన్ బేస్ సంపాదించుకునే ముందు ఆయుష్మాన్.. చాలా వృత్తుల్లో పనిచేశాడు. టీవీ షోలకు హోస్ట్‌గా, రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా, రేడియో జాకీగా, యాంకర్‌గా.. ఇలా అన్నింటిలో ఆయుష్మాన్‌కు ఎక్స్‌పీరియన్స్ ఉంది. అప్పట్లో డబ్బుల కోసం ట్రైన్స్‌లో, పెళ్లిళ్లల్లో పాటలు కూడా పాడేవాడట ఈ హీరో. ఇతర హీరోలు ఎవరూ టచ్ చేయని స్క్రిప్ట్స్‌ను ఎంపిక చేసుకొని, అందులో అద్భుతంగా నటించి తనను తాను ఒక సెల్ఫ్ మేడ్ స్టార్‌ను చేసుకున్నాడు. ఇప్పటికీ ఆయుష్మాన్ స్క్రిప్ట్ సెలక్షన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.


Also Read: నాకు గతంలో చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి, అందుకే ఇప్పుడిలా.. రెజీనా ఓపెన్ స్టేట్‌మెంట్

నాటకాలంటే ఇష్టం

ఆయుష్మాన్ అసలు పేరు నిషాంత్ ఖురానా. తను 1984 సెప్టెంబర్ 14న చంఢీగఢ్‌లోని ఒక పంజాబీ హిందూ ఫ్యామిలీలో జన్మించాడు. తన మూడో పుట్టినరోజుకు తన పేరును ఆయుష్మాన్‌గా మార్చేశాడు తల్లిదండ్రులు. ఆయుష్మాన్ పంజాబ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్‌లో మాస్ కమ్యూనికేషన్ పూర్తిచేశాడు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే నాటకాలు, థియేటర్ ప్లే, లైవ్ షోలలో యాక్టివ్‌గా పాల్గొనేవాడు. అయిదేళ్లపాటు నాటకాల్లో యాక్టివ్‌గా ఉన్నాడు. తను కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్నరోజుల్లేనే షిమ్లా గెయ్టీ థియేటర్‌లో పర్ఫార్మెన్స్‌లు ఇచ్చాడు. జర్నలిజంలో పీజీ చేసిన తర్వాత ఢిల్లీలోని రెడ్ ఎఫ్‌ఎమ్‌లో రేడియో జాకీగా జాయిన్ అయ్యాడు.

ఆ సినిమాతో

2004లో ప్రసారమయిన ఎమ్‌టీవీ రోడీస్ అనే షోలో ఆయుష్మాన్ ఖురానా కూడా ఒక కంటెస్టెంట్‌గా కనిపించాడు. దాంతో బుల్లితెరపై తన ప్రయాణం మొదలయ్యింది. వరుసగా పలు బుల్లితెర షోలను హోస్ట్ చేసే అవకాశం ఆయుష్మాన్‌కు లభించింది. అలా తనకు హీరోగా మొదటి అవకాశం కూడా వచ్చింది. ‘విక్కీ డోనర్’ అనే మూవీలో హీరోగా వెండితెరపై అడుగుపెట్టాడు. 2012లో విడుదలయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయంతో పాటు ఆయుష్మాన్ జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత వరుస ఫ్లాపులు ఎదురైనా డిఫరెంట్ స్క్రిప్ట్స్‌తో ప్రేక్షకులను మెప్పించి స్టార్‌గా నిలదొక్కుకున్నాడు. తన తర్వాత తన తమ్ముడు అపర్శక్తి ఖురానాను కూడా నటుడిగా పరిచయం చేశాడు.

Related News

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

Kanguva Runtime: కంగువ రన్ టైం రీవిల్ చేసిన దర్శకుడు, అదే ప్లస్ అవ్వనుందా.?

Viswam OTT : సడెన్ గా ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Pushpa 2 First Review: ‘పుష్ప 2’ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు.. నీయవ్వ తగ్గేదేలే..

Vettaiyan Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న వేట్టయాన్ కలెక్షన్స్… ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Big Stories

×