BigTV English

Regina Cassandra: నాకు గతంలో చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి, అందుకే ఇప్పుడిలా.. రెజీనా ఓపెన్ స్టేట్‌మెంట్

Regina Cassandra: నాకు గతంలో చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి, అందుకే ఇప్పుడిలా.. రెజీనా ఓపెన్ స్టేట్‌మెంట్

Regina Cassandra: సినీ పరిశ్రమలో డేటింగ్, రిలేషన్‌షిప్స్ అనేవి కామన్. ఒక హీరో, హీరోయిన్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉంటే చాలు.. వాళ్లు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా బాగుంటారని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. అలా డేటింగ్ చేసి వర్కవుట్ అవ్వక విడిపోయిన హీరోహీరోయిన్లు చాలామందే ఉన్నారు. తాజాగా హీరోయిన్ రెజీనా కూడా తన పర్సనల్ లైఫ్ గురించి, తన రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్‌గా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. తన అప్‌కమింగ్ మూవీ ‘ఉత్సవం’ ప్రమోషన్స్‌‌లో బిజీగా ఉన్న రెజీనా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తనకు నచ్చిన అబ్బాయి ఎవరూ దొరకలేదా అన్న ప్రశ్నకు తను ఆసక్తికర సమాధానం ఇచ్చింది.


మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా

ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించి తనకంటూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది రెజీనా. తనకు అవకాశాలు బాగానే వచ్చినా లక్ కలిసిరాక టాప్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. అయినా తన యాక్టింగ్ టాలెంట్‌ను గుర్తించి ఇప్పటికీ తనకు అవకాశాలు ఇస్తున్న మేకర్స్ చాలామందే ఉన్నారు. అలా ప్రస్తుతం తన చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘ఉత్సవం’. నాటక రంగంపై తెరకెక్కిన సినిమా కావడంతో దీనిని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడానికి రెజీనా కష్టపడుతోంది. చాలాకాలం తర్వాత తన మూవీ ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటోంది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యింది.


Also Read: ఆ సమయంలో భయపడ్డా, అందుకే ఇవ్వలేదన్న రవీనాటాండన్

బ్రేక్ తీసుకున్నాను

తనకు ఎవరైనా ఏదైనా చేయమని చెప్తే అస్సలు నచ్చదని, అసలు అది ఎందుకు చేయాలి అని రివర్స్ అవుతానని తన మనస్థత్వం గురించి చెప్పుకొచ్చింది రెజీనా. ఎందుకు, ఏంటి అని అడగకుండా చాలా తక్కువమంది చెప్పిన మాటే తాను వింటానని తెలిపింది. అలాంటి పార్ట్‌నరే తనకు కావాలని మనసులోని మాట బయటపెట్టింది. అయితే ఇప్పటివరకు తనకు ప్రపోజల్స్ ఏమీ రాలేదా, ఎవరికి కనెక్ట్ అవ్వలేదా అని అడగగా.. అలా చాలానే జరిగాయి అంటూ అసలు విషయం చెప్పుకొచ్చింది. ‘‘నేను గతంలో చాలా రిలేషన్‌షిప్స్‌లో ఉన్నాను. చెప్పాలంటే నేనొక సీరియల్ డేటర్. కానీ ప్రస్తుతం బ్రేక్‌లో ఉన్నాను’’ అంటూ ఇప్పుడు తాను సింగిల్ అని చెప్పకనే చెప్పింది రెజినా.

అలాంటి రూమర్స్

సుధీర్ బాబు సరసన నటించిన ‘ఎస్‌ఎమ్ఎస్’ అనే మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యింది రెజీనా. అంతకు ముందకు తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించినా.. తెలుగులో మాత్రం ఇదే తన మొదటి సినిమా. డెబ్యూతో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో, అందులో తన గ్లామర్‌తో ఆడియన్స్‌కు దగ్గరయ్యింది. హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుండి తనకు పలు తెలుగు హీరోలతో కూడా అఫైర్స్ ఉన్నాయని గాసిప్స్ వినిపించాయి. ముందుగా సందీప్ కిషన్‌తో తను ప్రేమలో ఉందని, ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ను కూడా తాను ప్రేమించిందని వార్తలు వచ్చాయి.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×