BigTV English

Raj Tarun Lavanya Love Story : ఏం ట్విస్టులురా బాబు.. సినిమాను తలపిస్తున్న లావణ్య- రాజ్ తరుణ్ లవ్ స్టోరీ

Raj Tarun Lavanya Love Story : ఏం ట్విస్టులురా బాబు.. సినిమాను తలపిస్తున్న లావణ్య- రాజ్ తరుణ్ లవ్ స్టోరీ

Raj Tarun Lavanya Love Story : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ – లావణ్య లవ్ స్టోరీలో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది. రాజ్ తరుణ్ పై లావణ్య కేసు పెట్టడంతో మొదలైన కేసుల పర్వం కొనసాగుతోంది. అతను తనను మోసం చేసి.. మరో యువతితో ఉంటున్నట్లు లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిన్న లావణ్య తనను, తన తమ్ముడిని వేధిస్తోందంటూ.. మాల్వీ మల్హోత్రా ఆమెపై ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే లావణ్య మరోసారి రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసింది. తన అబార్షన్ చేయించాడని పేర్కొంటూ.. మెడికల్ రిపోర్టులు, ఫొటోలు, తనను టార్చర్ చేసినట్లుగా ఉన్న ఆధారాలన్నింటినీ పోలీసులకు సమర్పించింది. దీంతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.


తాజాగా.. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో ఉన్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో రాజ్ తరుణ్ ను ఏ1 నిందితుడిగా, మాల్వీ మల్హోత్రాను ఏ2 నిందితురాలిగా, మయాంక్ మల్హోత్రాను ఏ3 నిందితుడిగా పేర్కొన్నారు. లావణ్యతో రాజ్ తరుణ్ కు 2008 నుంచి పరిచయం ఉందని, 2010లో ఆమెకు ప్రపోజ్ చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. 2014లో రాజ్ తరుణ్ తనను పెళ్లాడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. 2016లో తాను గర్భవతి అవ్వగా.. 2 నెలలో సర్జరీ చేసి అబార్షన్ చేశారని పేర్కొంది. రాజ్ తరుణ్.. మాల్వీ కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని, వాళ్లిద్దరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది లావణ్య. మాల్వీతో కలిసి విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్పింది. ఎలాగైనా అతను తనకు కావాలని తెలిపింది.

Also Read : లావణ్య కేసులో ట్విస్ట్.. రాజ్ తరుణ్ పై కేసు నమోదు


మరోవైపు రాజ్ తరుణ్ వెర్షన్ మరోలా ఉంది. లావణ్య ముంబైలో ఉండేదని, ఆమె అక్కడ.. తనిక్కడ ఉన్నప్పుడు తనతో కలిసి ఎలా ఉంటానని ఇటీవల ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయాడు. లావణ్యకు డబ్బు పిచ్చి ఉందని, ప్రతినెలా ఆమెకు డబ్బు పంపేవాడినని తెలిపాడు. డబ్బు పంపడం ఆపివేయడంతో.. ఇలా మోసం చేశాడంటూ తప్పు కేసులు పెడుతోందన్నాడు. రాజ్ తరుణ్ పై లావణ్య ఫిర్యాదులు, లావణ్యపై మాల్వీ ఫిర్యాదు.. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. చివరికిి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో, ఎవరెవరు జైలుకెళ్తారో చూడాలి.

 

Tags

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×