BigTV English

Mr Telangana Mohd Sohail Dies: రోడ్డు యాక్సిడెంట్.. మిస్టర్ తెలంగాణ విన్నర్ మహ్మద్ సోహైల్ మృతి

Mr Telangana Mohd Sohail Dies: రోడ్డు యాక్సిడెంట్.. మిస్టర్ తెలంగాణ విన్నర్ మహ్మద్ సోహైల్ మృతి

Mr Telangana Mohd Sohail Dies: బైక్‌లపై రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్త అని పదేపదే హెచ్చరిస్తున్నారు పోలీసులు. అంతేకాదు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు కూడా. అయినా యువత పట్టించుకోలేదు. ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పేరెంట్స్‌కు పుత్రశోకాన్ని మిగుల్చు తున్నారు. తాజాగా సిద్ధపేట్‌కు చెందిన బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదం మృతి చెందాడు.


తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లా సిద్దిపేట్‌కు చెందిన బాడీ బిల్డర్, మిస్టర్ తెలంగాణ విజేత 23 ఏళ్ల మహ్మద్ సోహైల్. జూన్ 29న సిద్ధిపేట్ నుంచి మిరుదొడ్డికి సోహైల్ బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పింది. అదే రోడ్డులో వెళ్తున్న స్కాప్‌తో వెళ్తున్న ఆటో రిక్షాను ఆయన వాహనం ఢీ కొట్టాడు. ఈ ఘటనలో సోహైల్, అతడి ఫ్రెండ్ ఖదీర్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.

చికిత్స తర్వాత వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని చెప్పడంతో సోహైల్‌ను తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు మహ్మద్ సోహైల్. సోహైల్ తన కెరీర్‌లో జిల్లా, రాష్ట్ర, దక్షిణాది స్థాయిల్లో బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్‌లను గెలుచుకున్నాడు.


ALSO READ: యాదాద్రి జిల్లాలో అగ్ని ప్రమాదం, ఓ కంపెనీలో మంటలు, కాకపోతే..

అంతేకాదు మిస్టర్ తెలంగాణ ఛాంపియన్ అయ్యాడు. కెరీర్‌లో సోహైల్ ఎదుగుతున్న సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పారు. బాడీ బిల్డింగ్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న సోహైల్ చిన్న వయస్సులో దూరం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అతడి ఫ్రెండ్స్.

Tags

Related News

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Big Stories

×