BigTV English

Vishwambhara – Bimbisara: బింబిసార – విశ్వంభరకి లింక్.. ఇదెక్కడి మాస్ రా మావ..!

Vishwambhara – Bimbisara: బింబిసార – విశ్వంభరకి లింక్.. ఇదెక్కడి మాస్ రా మావ..!

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. గతేడాది ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ‘భోళా శంకర్’ మూవీతో వచ్చి ఊహించని ఫ్లాప్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఒక సూపర్ హిట్ కొట్టే లక్ష్యంతో ‘బింబిసార’ మూవీ దర్శకుడు వశిష్టతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నాడు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా తర్వాత మెగాస్టార్ మళ్లీ అలాంటి సోషియో ఫాంటసీ సినిమా చేస్తుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మెగాస్టార్ చిరు రోల్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. అలాగే దర్శకుడు వశిష్ట గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ టాక్ నడుస్తోంది. ఇందులో చిరుకి జోడీగా త్రిష నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారు. అలాగే ఇందులో మరో ఐదుగురు నటీమణులు కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. ఇటీవలే ఆమెకు సంబంధించి మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘విశ్వంభర’ సినిమాకి అలాగే కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమాకి లింక్ ఉందంటూ తాజాగా ఓ గాసిప్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు ఒకే సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమంటూ టాక్ నడుస్తోంది. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ గాసిప్ రావడానికి కూడా ఓ కారణముంది. ప్రస్తుతం అంతా సినిమాటిక్ యూనివర్స్‌‌లోనే సినిమాలు తెరకెక్కుతున్నాయి.


Also Read: మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ సర్‌ప్రైజ్ వచ్చేస్తుంది.. ఏంటో తెలుసా?

ఇది వరకు హాలీవుడ్ మాత్రమే సినిమాటిక్ యూనివర్స్‌లో చిత్రాలు తెరకెక్కించేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే బాట పట్టింది. ఈ మధ్య ఈ యూనివర్స్ ప్రభావం టాలీవుడ్‌లో బాగా పెరిగిపోయింది. ఇదివరకే దర్శకుడు లోకేష్ కనగరాజ్ (ఎల్‌సియూ)అనే సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రకటించాడు. అలాగే ప్రశాంత్ వర్మ కూడా (పివిసియు)అనే యూనివర్స్‌తో సినిమా చేస్తానని తెలిపాడు. ఇక నాగ్ అశ్విన్ కల్కి కూడా సినిమాటిక్ యూనివర్స్‌లోనే రాబోతుంది.

దీంతో వశిష్ట కూడా బింబిసార – విశ్వంభర సినిమాలను కనెక్ట్ చేసి ఒక సినిమాటిక్ యూనివర్స్‌లో రూపొందిస్తున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. అంతేకాకుండా దర్శకుడు వశిష్ట తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో ఒకవైపు బింబిసార, మరోవైపు విశ్వంభర ఫోటోలు పెట్టడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీనిపై కొందరు పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే దీనిపై మాత్రం మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చూడాలి మరి త్వరలో ఏమైనా అప్డేట్ వస్తుందా అని.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×