BigTV English
Advertisement

Balagam/ Janaka aitey Ganaka : “బలగం”లా ఈ సినిమాను నిలబెట్టలా.?

Balagam/ Janaka aitey Ganaka : “బలగం”లా ఈ సినిమాను నిలబెట్టలా.?

Balagam/ Janaka aitey Ganaka : సుహస్ హీరోగా చేస్తున్న సినిమా “జనక అయితే గనక” ఈ సినిమా అక్టోబర్ 12న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే అక్టోబర్ 12 కంటే ముందు ఈ సినిమా పలుచోట్ల ప్రదర్శించబడుతున్నట్లు అధికారికంగా నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఇలా ముందుగానే ఒక సినిమాను చూపిస్తున్నారంటే ఆ సినిమా మీద ఉన్న నమ్మకం అలాంటిదే అని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ కి సరిగ్గా వారం రోజులు ముందు విజయవాడలో 6వ తారీఖున ఈ సినిమా షో వేయనున్నారు. ఆ తర్వాత తిరుపతిలో కూడా ఈ షో ప్లాన్ చేస్తున్నారు. అయితే ముందుగా కొన్ని బలంగా నమ్మిన సినిమాలను మీడియా పీపుల్ కి చూపించడం దిల్ రాజుకి అలవాటు. అలానే వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమాని కూడా చూపించారు.


బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఒక ఊరు ఊరంతా కూర్చుని తెరపై బలగం సినిమాను చూసారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. కమెడియన్ గా పరిచయమైన వేణులో ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడా అని అందరికీ ఆశ్చర్యం కలిగించాడు. ఈ సినిమా సక్సెస్ తీసుకురావడమే కాకుండా ప్రశంసలతో పాటు అవకాశాలను కూడా తీసుకొచ్చింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ కు మొదటి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు జనక అయితే గనక సినిమాను ముందుగా మీడియాకు చూపించనున్నారు. అయితే ఈ సినిమా నచ్చితే బలగం సినిమాని పుష్ చేసినట్లు ఈ సినిమాని చేయండి. ఈ సినిమా నచ్చకపోతే రిలీజ్ వరకు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండండి అని మీడియాకు చెప్పాడు దిల్ రాజు.

నిజంగా ఒక సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎలా బ్రహ్మరథం పడతారు అని చెప్పడానికి ఉదాహరణకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇక సుహాష్ ఎంచుకునే సినిమాల విషయం మీద కూడా అందరికీ మంచి నమ్మకం ఉంది. ఇప్పటివరకు సుహాస్ చేసిన ప్రతి సినిమాకి మంచి పేరు రావడంతో పాటు కమర్షియల్ గా కూడా హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు రాబోతున్న జనక అయితే గనక అనే సినిమా మీద కూడా అదే స్థాయిలో నమ్మకాలు ఉన్నాయి. అయితే ఇక బలగం రేంజ్ లో ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చూడక తప్పదు.


Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×