BigTV English

Balakrishna: సూపర్ హీరోగా మారనున్న బాలయ్య.. రేపే అనౌన్స్మెంట్..!

Balakrishna: సూపర్ హీరోగా మారనున్న బాలయ్య.. రేపే అనౌన్స్మెంట్..!

Balakrishn : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ (Balakrishna) అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. యుక్త వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటుడిగా రికార్డ్ సృష్టించడంతో ఈయనను సినీ పరిశ్రమ ఘనంగా సత్కరించింది కూడా.. తన చిత్రాలలో కామెడీ తో పాటు ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ ఉండాల్సిందే. అందుకే బాలయ్య సినిమాలు అంత విజయం సాధిస్తున్నాయని చెప్పవచ్చు.


కొత్త జానర్ లోకి బాలకృష్ణ ఎంట్రీ..

ముఖ్యంగా బాలకృష్ణ సామాజిక ఫాంటసీ నుండి యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్ వరకు విభిన్న పాత్రలకు ప్రసిద్ధి చెందారు. దశాబ్దాల పాటు సాగిన కెరియర్ లో డైనమిక్ ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిరంతరం తనను తాను ఆవిష్కరించుకుంటూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన తాజాగా సూపర్ హీరోగా మారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు క్లుప్తంగా అన్వేషించిన రాజ్యం అయిన సూపర్ హీరో జానర్లో కి తాజాగా బాలకృష్ణ ప్రవేశిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా ఇప్పుడు సూపర్ హీరో సినిమాతో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే.


సూపర్ హీరోగా మారనున్న బాలకృష్ణ..

ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు సూపర్ హీరో కాన్సెప్ట్ తో కొడుకు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుండగా.. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో బాలయ్య కూడా ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. సాంప్రదాయకంగా యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్లపై దృష్టి సారించిన బాలకృష్ణకు ఇది ఊహించని మార్పు అని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ సూపర్ హీరోగా నటించబోయే కొత్త చిత్రం గురించి రేపు దసరా పండుగ సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే సూపర్ హీరో అవతారంలో బాలకృష్ణకు సంబంధించి ఏ ఐ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం అభిమానులు సైతం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు ఎప్పుడూ మాస్ యాంగిల్ లో బాలయ్య ను చూసి కొంచెం విసిగిపోయిన అభిమానులు ఎప్పుడెప్పుడు సూపర్ హీరోగా కనిపిస్తాడు అంటూ చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

బాలకృష్ణ కెరియర్..

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. సినిమాలలో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన డబుల్ హ్యాట్రిక్ తో ప్రేక్షకులను అలరించారు. సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ హిందూపురం నియోజకవర్గం నుండి మూడవసారి పోటీ చేసి ఇప్పుడు కూడా విజయాన్ని అందుకొని హ్యాట్రిక్ అందుకున్నాడు. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈయన, తన సేమాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు కూడా పొందుతున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే చివరిగా వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను అలరించినఈయన .. ఇప్పుడు బాబి డైరెక్షన్లో కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఆ సినిమా విడుదలకు ముందే ఇప్పుడు మరో సినిమా అనౌన్స్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×