BigTV English

Balakrishna: 20 రోజులకు మరీ ఇన్ని కోట్లా..? జైలర్ 2కు బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్

Balakrishna: 20 రోజులకు మరీ ఇన్ని కోట్లా..? జైలర్ 2కు బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్

Balakrishna..సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. యాక్షన్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ముఖ్యంగా తన సినిమాలలో సీనియర్ స్టార్ హీరోలకి కూడా అవకాశం కల్పిస్తూ.. సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే ‘జైలర్’ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించిన రజనీకాంత్.. ఇప్పుడు ‘కూలీ’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాదు ‘జైలర్’ సినిమా సీక్వెల్ తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఇక కేరళలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోకి.. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అడుగుపెట్టినట్లు సమాచారం.


జైలర్ 2 కోసం బాలకృష్ణ భారీ డిమాండ్..

ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే.. జైలర్ 2 సినిమా కోసం బాలకృష్ణ తన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని భారీగా డిమాండ్ చేశారట. తన కెరీర్ లోనే ఇప్పటివరకు చూడని అత్యధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. జైలర్ -2 లో గెస్ట్ పాత్ర కోసం ఏకంగా రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలి అని డిమాండ్ చేయడంతో.. బాలకృష్ణకి వున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే బాలయ్య జైలర్ 2 సినిమా కోసం 20 రోజుల డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసి 20 రోజుల కోసం రూ.50 కోట్లా.. బాలయ్య డిమాండ్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే బాలయ్య కెరియర్ లోనే జైలర్ 2 కోసం అత్యధిక పారితోషకం తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మోహన్ లాల్ (Mohan Lal) తదితరులు నటిస్తున్నారు.


తిరిగి చేరబోతున్న భారీతారాగణం..

ఇకపోతే సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2023 లో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ , యోగి బాబు, మిర్నా మీనన్ జైలర్ సినిమాలో నటించగా.. వీరంతా కూడా తిరిగి జైలర్ 2 లో నటిస్తున్నారు. ఇకపోతే ఎస్.జె. సూర్య , ఫహద్ ఫాజిల్, బాలకృష్ణ భాగమవుతుండగా.. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తిరిగి మళ్లీ అది పాత్రలోనే నటిస్తున్నారు. మొదటి భాగంలో తెలుగువారికి పెద్దగా స్కోప్ ఇవ్వకపోవడం వల్లే తెలుగులో కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు అందుకే.. ఇప్పుడు పద్మ భూషణ్ గ్రహీత బాలకృష్ణను రంగంలోకి దింపి.. తెలుగులో కూడా భారీ కలెక్షన్లు వసూలు చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరి వారి ప్లాన్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

ALSO READ; Big TV Kissik Talks: ఇండస్ట్రీపై సమంత కంప్లైంట్.. నిజాలు బయటపెట్టిన శివాజీ..!

బాలకృష్ణ సినిమాలు..

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. చివరిగా డైరెక్టర్ బాబీ (Bobby) దర్శకత్వంలో డాకు మహారాజు సినిమా చేసి విజయాన్ని అందుకున్న ఈయన.. ప్రస్తుతం అఖండ సీక్వెల్ అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో సీనియర్ స్టార్ హీరోయిన్ లయ కూతురు శ్లోకా కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక మొత్తానికి అయితే బాలయ్య కూడా వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. ఇతర హీరోల సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ మరింత బిజీగా మారారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×