BigTV English

Big TV Kissik Talks: ఇండస్ట్రీపై సమంత కంప్లైంట్.. నిజాలు బయటపెట్టిన శివాజీ..!

Big TV Kissik Talks: ఇండస్ట్రీపై సమంత కంప్లైంట్.. నిజాలు బయటపెట్టిన శివాజీ..!

Big TV Kissik Talks..బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్ షో’ ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి వచ్చి తమ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకుంటూ అభిమానులకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష (Varsha ) హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అద్భుతమైన వాక్చాతుర్యంతో సెలబ్రిటీలను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా.. చాకచక్యంగా విషయాలను రాబడుతూ హోస్టుగా సక్సెస్ అయ్యింది వర్ష. ఇదిలా ఉండగా తాజాగా ఈ కిస్సిక్ టాక్స్ షో కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేయగా.. ఈ ఎపిసోడ్ కి ప్రముఖ సీనియర్ హీరో కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా (Sivaji Raja) గెస్ట్ గా హాజరయ్యారు. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్న ఆయన.. సమంత (Samantha) ఇండస్ట్రీపై చేసిన కంప్లైంట్ గురించి కూడా తెలిపారు. మరి అసలేమైందో ఇప్పుడు చూద్దాం.


నక్సలైట్ అవుదాం అనుకున్నా..

ఇంటర్వ్యూలో భాగంగా ఎవరైనా మంచి యాక్టర్, పొలిటిషన్, లాయర్, డాక్టర్, ఇంజనీర్ ఇలా ఏదైనా ఒక మంచి స్థానంలో ఉండాలని కోరుకుంటారు. మీరేంటి నక్సలైట్ అవ్వాలనుకున్నారు..? ఒకవేళ నక్సలైట్ అయి ఉండి ఉంటే సమాజానికి ఏం చేసేవారు? అని వర్ష ప్రశ్నించగా.. దానికి శివాజీ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు బ్రతికి ఉండాలి కదా” అంటూ కామెంట్ చేశారు.


ఇండస్ట్రీపై సమంత కామెంట్స్..

ఇకపోతే తాను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తన వద్దకు ఎంతోమంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు.. అలాంటి వారిలో సమంత (Samantha) కూడా ఒకరు. సమంత ఇండస్ట్రీపై కామెంట్లు చేయడానికి వచ్చినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఆమె ఎంత నరకం అనుభవించి ఉండి ఉంటే నా వద్దకు వస్తుంది. ఆ సమయంలో సమంత ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది అంటూ శివాజీ తెలిపారు. ఇకపోతే సమంత కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే.. మలయాళం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించినప్పుడు.. అందులో ఎంతోమంది సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన నష్టాన్ని, ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. ఇక ప్రతి భాషా ఇండస్ట్రీలో కూడా జస్టిస్ హేమా కమిటీ లాంటి ఒక కమిటీ వేయాలి అని, ఎంతోమంది ముందుకు రాగా.. టాలీవుడ్ నుంచి కూడా అనుష్క(Anushka ), సమంత (Samantha) లాంటి హీరోయిన్స్ ముందడుగు వేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అసలు టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఏంటి..? అందులోనూ ఇంత బడా హీరోయిన్లు టాలీవుడ్ లో కమిటీ వేయాలని కోరడం ఏంటి ?అంటూ ముక్కున వేలేసుకున్నారు. దీనికి తోడు ఇప్పుడు శివాజీ రాజా కూడా ఇండస్ట్రీపై కంప్లైంట్ ఇవ్వడానికి సమంత తన వద్దకు వచ్చిందని చెప్పడంతో అందరూ నిజమేనని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా సమంత లాంటి హీరోయిన్లకే క్యాస్టింగ్ కౌచ్ తప్పలేదంటే, ఇక కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటూ కూడా నెటిజన్స్ పలు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×