Illu Illalu Pillalu Today Episode may 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా ప్రేమ ఇద్దరూ శ్రీవల్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. నర్మదా అత్తయ్యకు ప్రేమతో బజ్జీలు తెస్తే ఎటువంటి ఆయిల్లో వేసారు అంటూ పెద్ద క్లాసులు పీకింది. అప్పటి నుంచి ఆవిడ ఏదో బజ్జీలు తిననట్టు ఇంతగా ఆలోచిస్తుందంటే అని నర్మదా సీరియస్ అవుతుంది. ఇక ప్రేమ కూడా ధీరజ్ని మావయ్య తిట్టిన విషయాన్ని నర్మదతో చెప్తుంది.. మావయ్య తన కొడుకుని తిట్టొచ్చు కొట్టొచ్చు అయినా ఈవిడకెందుకు పళ్ళు ఇక్కిలిచ్చి నవ్విందని ప్రేమ అంటుంది. చూస్తుంటే ఆవిడ రోజుకి మన మీద కూడా పెత్తనం ఎలా చూస్తుంది అని నర్మదా అంటుంది.. అవునక్కా నిజంగానే అలానే అనిపిస్తుంది ఎలాగైనా ఆవిడ పొగడ్ని అణిచివేయాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి ఏంటి తోడికోడలు ఇద్దరు ఏదో గుడుపుటాని చేస్తున్నారు అని అడుగుతుంది. మీ పెద్ద కోడలు అలా బజ్జీలు విసిరేయడం ఏమైనా బాగుందా చెప్పండి అని నర్మదా సీరియస్ అవుతుంది. అది తప్పే కానీ నా ఆరోగ్యం కోసం చేశానని చెప్పింది కదా ఇక దాని గురించి వదిలేయచ్చు కదా అని వేదవతి ఇద్దరు కోడళ్ల తో అంటుంది.. నర్మదా మాత్రం వేదవతికి దిమ్మతిరిగే షాకిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సాగర్ నర్మద దగ్గరకొచ్చి సారీ నర్మదా అని చెప్తాడు. నర్మదా సారీ ఎందుకు చెప్తున్నారు అని అడుగుతుంది. నేను రెస్టారెంట్లో బిల్లు కట్టలేదు కదా అందుకు నువ్వు ఫీల్ అయ్యావ్ ఏమో అని సారీ చెప్పానని అంటాడు. రెస్టారెంట్లు బిల్లు కట్టనందుకు నేను ఫీల్ అవ్వలేదు రెస్టారెంట్ బయట ఒక అనాధ లాగా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు చూడు.. అది నాకు బాధగా అనిపించింది అని నర్మద అంటుంది. భార్యను రెస్టారెంట్ కి తీసుకెళ్లాలని తండ్రితో ధైర్యంగా చెప్పలేవు.. ఒక 1000 రూపాయలు కూడా అడిగి తీసుకురాలేవు నువ్వే మనిషివి రేపు కాపురం చేయాలన్నా మీ నాన్నను అడిగే కాపురం చేస్తావని నర్మదా సీరియస్ అవుతుంది. సాగర్ కూడా సీరియస్ అవుతాడు..
నర్మద అన్న విషయాల గురించి సాగర్ బాధపడుతూ ఉంటాడు. నర్మదా అన్న మాటల్లో తప్పులేదు కదా అని సాగర్ ఆలోచిస్తూ బయట ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్ ఏమన్నా అన్నయ్య ఇలా కూర్చున్నావని అడుగుతాడు. సాగరు మీ వదినను రెస్టారెంట్ కి తీసుకెళ్ళాను రా కానీ నాన్న మాత్రం నన్ను ఇలా తిట్టాడు నేను చాలా బాధపడ్డాను. ఇక వదిన నీ బయటికి తీసుకెళ్ళు ఎందుకు కనీసం నా దగ్గర రెస్టారెంట్లు బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవు. పెళ్ళైన తర్వాత కనీసం కోరికలనే ఉంటాయి కదా.. ఇలాంటి విషయాల్లో ఆయనకు అనుభవం ఉంది కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నారో నాన్న నాకు అర్థం కావట్లేదని సాగర్ అంటాడు.
ఇక ధీరజ్ నాన్న ఏం చేసినా బాధ్యతగా చేస్తాడు కదా అన్నయ్య ఇది కూడా మనము బాధ్యత తప్పి పోతామని ఇలా చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదని అంటాడు. కానీ సాగర్ మాత్రం పెళ్లయిన తర్వాత కూడా మనల్ని ఇలా బంధిస్తే ఏం బాగుంటుంది. కొంచెమైనా మనకి ఫ్రీడం ఇవ్వాలి కదా అని అంటాడు. శ్రీవల్లి చందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చందు ఇంట్లోకి రాగానే శ్రీవల్లి నీకోసమే వెయిట్ చేస్తున్నాను బావ నాకు ఎంత బోర్ కొట్టిందో తెలుసా అని అడుగుతుంది. బోర్ ఎందుకు కొడుతుంది ఇంట్లో అందరూ ఉన్నారు కదా అందరితో కలిసిపోయి మాట్లాడితే బాగుంటుంది కదా అని అంటాడు.
ఆ బ్యాగ్ తీసి అక్కడ పెట్టేసేయ్ అని శ్రీవల్లిని చందు అంటాడు అయితే శ్రీవల్లి మాత్రం బ్యాగ్ లో ఉన్న డబ్బుల్ని చూస్తుంది. ఈ డబ్బులు ఎవరి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు బావ అనేది అడుగుతుంది. నెల అయింది కదా నా జీతం వచ్చింది. అందుకే తీసుకొచ్చాను రేపు ఉదయం నాన్నకి ఇవ్వాలి కదా అని అంటాడు.. కానీ శ్రీవల్లి మాత్రం ఈ డబ్బులు ఎంత బావ అని అడుగుతుంది. అయితే శ్రీవల్లి పెళ్లయిన తర్వాత కూడా ఇంకా నాన్నకు డబ్బులు ఇవ్వడమేంటి.. ఎవరైనా పెళ్లి తర్వాత పెళ్ళాం కి డబ్బులు ఇస్తారు కదా ఈ లెక్కన బావ నాకు డబ్బులు ఇవ్వాలి కదా అని అంటుంది.
ఇంట్లో ఆయనొక్కడే జాబ్ చేస్తున్నాడు అంటే జీతం మొత్తం మా ఆయన వేస్తున్నాడు ఇంతమందిని పోషించేది మా ఆయనే అని శ్రీవల్లి మనసులో దుర్బుద్ధి మొదలవుతుంది. మా అమ్మ 5000 తో నెల అంతా ఇంటిని గడిపించేది.. 50,000 జీతం డబ్బులు అంటే ఎంతమందిని పోషిస్తున్నాడు మా బావ అని శ్రీవల్లి ఆలోచిస్తుంది. ఉదయం లేవగానే వేదవతి అందరికీ కాఫీ తెచ్చేస్తుంది. కోడల్ని చూస్తూ ఉంటే నా కళ్ళు చల్లబడి పోతున్నాయి. ఇలా ఏ ఇంట్లో ఉంటారు చెప్పండి ముగ్గురు కోడళ్ళు అన్యోన్యంగా ఉంటారని గొప్పగా పొగిడేస్తుంది.
అయితే ఉదయం అందరూ హాల్లో ఉండగానే చందు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళ నాన్నకి ఇస్తారు ఇదిగో నాన్న నా జీతం వచ్చింది అని చెప్తాడు. అలాగే చందు కూడా ఇదిగో నా జీతం వచ్చింది నాన్న అని 6000 తెచ్చి ఇస్తాడు. ఈ డబ్బులు నాకు ఎందుకు ఇస్తున్నావ్ రా అని రామరాజు అడుగుతాడు. నాకు నా భార్యను పోషిస్తున్నారు కదా నాన్న అందుకే నేను నీ డబ్బులు ఇస్తున్నానని అంటాడు. ఇద్దరు మనుషులు ఇంట్లో తింటున్నారంటే నెలకు వాళ్లకి ఎంత ఖర్చులు అయితాయి అని సీరియస్ అవుతాడు. ఇంట్లోని వాళ్ళందరూ రామరాజుకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తారు కానీ రామరాజు మాత్రం వినకుండా శ్రీవల్లిని ఇద్దరు మనుషులు ఇంట్లో తింటున్నారంటే ఎంత ఖర్చు అవుతాయి చెప్పమ్మా అని అడుగుతాడు. శ్రీవల్లి ఎనిమిది నుంచి పదివేల వరకు ఖర్చవుతాయని లెక్క వేసి చెప్తుంది. నువ్వు 6000 ఇచ్చావు అంటే నువ్వు నీ భార్య ఖాళీగా కూర్చుని తింటున్నారనే కదా అర్థం అని రామరాజు అంటాడు. ఆ మాటకు అందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..