Balakrishna: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఈ మధ్యకాలంలో చేసే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి.బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా కనీసం హిట్స్ అయినా అవుతున్నాయి. మరి ఒకప్పుడు ఒక సినిమా హిట్ మరో సినిమా ఫ్లాప్ అనేలా ఉండే బాలయ్య సినీ కెరియర్ ఇంతలా మారిపోవడానికి కారణం ఏంటి.. ? బాలకృష్ణ వరుసగా.. నాలుగు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడానికి కారణం ఆ లేడీనేనా..? ఆమె వల్లే బాలకృష్ణకు వరుస సూపర్ హిట్స్ వస్తున్నాయా.. ? ఇంతకూ ఆమె ఎవరు?అనేది ఇప్పుడు చూద్దాం.
ఈతరం హీరోలకు పోటీగా బాలయ్య..
నందమూరి బాలకృష్ణ అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పడి చచ్చిపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ వద్ద పొట్టేళ్ల తలలు తెగి పడతాయి. ఎందుకంటే తాజాగా విడుదలైన ‘డాకు మహారాజ్’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సినిమా థియేటర్ల దగ్గర బాలయ్య ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించి, పొట్టేళ్ల తలలు నరుకుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు బాలకృష్ణ పేరు చెప్పగానే నరసింహనాయుడు, సమరసింహారెడ్డి , లక్ష్మీనరసింహ వంటి ఎన్నో హిట్ సినిమాలు గుర్తుకువచ్చేవి. కానీ బాలకృష్ణ అప్పుడు చేసినటువంటి సినిమాలు అయితే ఇప్పటి దర్శకులు తీయడం లేదు. అయినా సరే హిట్స్ మాత్రం బాలకృష్ణ అందుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న సీనియర్ హీరోలలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో కేవలం బాలకృష్ణ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి (Chiranjeevi) చేసిన వరుస సినిమాలు హిట్ అవ్వడం లేదు. అలాగే నాగార్జున(Nagarjun), వెంకటేష్(Venkatesh)లు చేసిన వరుస సినిమాలు కూడా ఆడడం లేదు. కానీ బాలకృష్ణ చేసిన వరుస సినిమాలు సూపర్ హిట్స్ అందుకోవడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
కొత్త డైరెక్టర్లను నమ్ముకుంటున్న బాలయ్య..
ఇక బాలకృష్ణ ‘అఖండ’ మూవీ కంటే ముందు చేసిన సినిమాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ అఖండ సినిమా తర్వాత ఆయన తన ఆలోచనలన్ని మార్చేశారు. ఎందుకంటే ఆయనతో సినిమాలు తీసే డైరెక్టర్లను గుడ్డిగా నమ్మకుండా.. ఎవరైతే తనకు మంచి సినిమాను అందించగలరో వారినే ఎంచుకుంటున్నారట. అందుకే బాలకృష్ణ ఈ మధ్యకాలంలో గోపీచంద్ మలినేని, బాబీ కొల్లి, బోయపాటి శ్రీను,అనిల్ రావిపూడి వంటి దర్శకులను నమ్ముతున్నారు. ముఖ్యముగా పాత చింతకాయ పచ్చడి లాంటి కథలను ఇచ్చే దర్శకులను పక్కనపెట్టి, జనరేషన్ కి తగ్గట్టు సినిమా కథని అందించే డైరెక్టర్లనే ఎంచుకుంటున్నారు బాలకృష్ణ. అలాగే సినిమా ఒప్పుకునే ముందు డైరెక్టర్లతో తన ఐడియాలను కూడా చెప్పి సినిమాలు హిట్ అవ్వడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారట.
తేజస్విని చేయి పడితే బాలయ్య మూవీ హిట్ కొట్టాల్సిందే..
ముఖ్యంగా బాలకృష్ణ వరుస హిట్స్ కొట్టడం వెనుక బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని (Tejaswini) హస్తముందట. ఎందుకంటే గత కొద్దికాలం నుండి బాలకృష్ణ సినిమాలకు సంబంధించి అన్ని పనులు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్వినీయే దగ్గరుండి చూసుకుంటుంది. అందుకే ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అని, బాలకృష్ణ చిన్న కూతురు లక్కీ హ్యాండ్ అని,ఆమె హ్యాండ్ పడితే బాలకృష్ణ సినిమాలు సూపర్ హిట్ అని నందమూరి ఫ్యాన్స్ తేజస్వినిని పొగుడుతున్నారు. ఇక బాలకృష్ణ నటించిన అఖండ మూవీ నుండి ఆ తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి,భగవంత్ కేసరి ఇప్పుడు వచ్చిన డాకు మహారాజ్ ఈ సినిమాలన్నీ పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్లుగా నిలిచాయి.ఇక బాలకృష్ణ నటించబోతున్న అఖండ 2 మూవీ కూడా బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు.