India Women Team Record: ఐర్లాండ్ – ఇండియా మహిళల జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ నెగ్గి 1- 0 ఆదిత్యంలో ఉన్న భారత మహిళా జట్టు రెండవ వన్డేలో కూడా గెలిచి సిరీస్ ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఆదివారం 2 వన్డేలో బరిలోకి దిగింది. రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండవ వన్డేలో టాస్ నెగ్గిన భారత మహిళా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
Also Read: Ira Jadhav: 14 ఏళ్ల అమ్మాయి సంచలనం.. వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ
భారత్ నిర్ణీత 50 ఓవర్లలో {India Women Team Record} ఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. అయితే భారత బ్యాటింగ్ లో జమీమా రోడ్రిక్స్ (102) సెంచరీ తో చెలరేగింది. తన కెరీర్ లో తొలి వన్డే సెంచరీని నమోదు చేసింది. ఇక ఓపెనర్లు స్మృతి మందాన (73), ప్రతీకా రావల్ (67), హార్లిన్ డియోల్ (89) పరుగులతో రాణించారు. దీంతో భారత మహిళా జట్టు భారీ స్కోర్ ని సాధించింది. ఇప్పటివరకు భారత మహిళా జట్టు చేసిన అత్యధిక స్కోర్ ఇదే.
2017 మే 15వ తేదీన ఐర్లాండ్ మహిళా జట్టుపై 358 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేసింది భారత మహిళా జట్టు. ఇక ఈ రెండో వన్డేలో ఐర్లాండ్ బౌలర్లలో ఓర్లా 2, కెల్లీ 2, డెంప్సీ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 371 పరుగుల భారీ లక్ష్య చేదనకు దిగిన ఐర్లాండ్ ఏడవ ఓవర్ 3 బంతికి తన తొలి వికెట్ ని కోల్పోయింది. 12 పరుగులు చేసిన ఐర్లాండ్ జట్టు కెప్టెన్ గాబి లూయిస్ ని సయాలి సత్ ఘరే పెవిలియన్ చేర్చింది.
ప్రస్తుతం ఐర్లాండ్ మహిళా జట్టు 10 ఓవర్లలో 41 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం సారా ఫోర్బ్స్ (21*), వికెట్ కీపర్ కౌంటర్ రీల్లీ (0*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఈ రెండవ వన్డేలో ఐర్లాండ్ విజయం సాధించాలంటే మరో 330 పరుగులు చేయాల్సి ఉంది. భారత మహిళా క్రికెటర్లు సత్తా చాటుతున్నారు.
సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ ఐర్లాండ్ జట్టును ఓడించేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు ఐర్లాండ్ జట్టు కనీసం పోటీ ఇచ్చేందుకు కూడా తడబడుతోంది. ఇక మొదటి వన్డేలో భారత మహిళా జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి వన్డేలో ప్రతీకా రావల్ 96 బంతులలో 89 పరుగులు చేసింది.
Also Read: Rohit Sharma: నా వల్ల కాదు.. టీమిండియాకు కొత్త కెప్టెన్ ను పెట్టుకోండి !
అలాగే తేజల్ హసన్బీస్ 46 బంతులలో 53 పరుగులతో రాణించి జట్టు అద్భుత విజయాన్ని అందుకునేందుకు సహకరించింది. కానీ బౌలింగ్ విభాగంలో భారత జట్టు అనుకున్నంతగా రాణించలేదు. భారత బౌలింగ్ విభాగంలో ప్రియా మిశ్రా మాత్రమే రెండు వికెట్లు పడగొట్టగా.. సాదు, సయాలి, దీప్తి శర్మ తలో వికెట్ మాత్రమే తీశారు. ఈ రెండవ వన్డేలో ఎలాగైనా విజయం సాధించి సిరీస్ ని కైవసం చేసుకోవాలని భారత జట్టు ఆరాటపడుతుంది.
🚨 𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗕𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗔𝗹𝗲𝗿𝘁 🚨
A historic day for #TeamIndia! 🙌 🙌
India register their Highest Ever Total in ODIs in Women’s Cricket 🔝 👏#INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/VpGubQbNBe
— BCCI Women (@BCCIWomen) January 12, 2025