South Korea Plane Crashed : ఇటీవల దక్షిణ కొరియా (South Korea)లోని మువాన్ ఎయిర్ పోర్టులో జెజు ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737-800 ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసింది. ఈ ప్రమాద విచారణంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమదానికి కారణాల్ని విశ్లేషిస్తున్న అధికారులకు.. విమానం రన్ వే ను ఢీ కొట్టి పేలిపోవడానికి ముందు నాలుగు నిముషాల ముందు నుంచి బ్లాక్ బాక్స్(black boxes) రికార్డింగ్ కాలేదని గుర్తించారు. ప్రమాదాలు, ప్రయాణ స్థితిగతులు, ప్రమాద కారణాల్ని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు.. బ్లాక్ బాక్స్ కీలకంగా పనిచేస్తాయి. అలాంటి.. కీలక ఆధారాలే లభించకపోవడంతో.. దర్యాప్తు అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రమాద కారణాల ప్రాథమిక పరీక్షల తర్వాత.. కొంత డేటా కోల్పోయినట్లు దక్షిణ కొరియా అధికారులు గుర్తించారు. దాంతో.. మరింత మెరుగైన పరీక్షలు, పరిశీలన కోసం పరికరాలను NTSBకి పంపారు. అక్కడ సమగ్రంగా, అన్ని రకాల పరిశీలనలు చేసిన తర్వాత.. విమానం క్రాష్ అవ్వడానికి నాలుగు నిమిషాల ముందు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు, ఫ్లైట్ డేటా.. రెండూ పనిచేయలేదని యుఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ – NTSB నిర్థరించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తాజాగా తెలిపింది. అయితే.. చివరి నాలుగు నిమిషాల్లో డేటా రికార్డింగ్ లో వచ్చిన సమస్యలేంటి, పరికరాలు ఎందుకు విఫలమయ్యాయో ఇంకా కనుక్కోలేదని సౌత్ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ(Transportation Ministry) తెలిపింది.
ప్రమాదాలను పరిశోధించడంలో CVR – (కాక్‌పిట్ వాయిస్ రికార్డర్), FDR – (ఫ్లైట్ డేటా రికార్డర్) నుంచి వచ్చే డేటా కీలకం. అలాంటి డేటా కోల్పోయినా.. మిగతా పరికరాల డేటా, మరిన్ని విశ్లేషణల ద్వారా కారణాన్ని గుర్తించేందుకు తాము అన్ని విధాలా ప్రయత్నిస్తామని (investigating) సౌత్ కొరియా అధికారులు వెల్లడించారు.
సౌత్ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండిగ్ గేర్ లో సమస్య కారణంగా.. రన్ వే(Run way) పై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన ఓ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. రన్ వే పై జారుకుండా వెళ్లి చివర్లోని సేఫ్టీ వాల్ ని ఢీ కొట్టి పేలిపోయింది. ఈ ఘటనలో విమానంలో 181 మందిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, 179 మంది చనిపోయారు. ల్యాండింగ్ గేర్(landing gare)లో తలెత్తిన సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ విషయమైన స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. ఇలాంటి సాంకేతిక సమస్యలు(technical issues) ఎదురవుతున్నాయి.
Also Read : పక్షులు విమానాన్ని కూల్చేస్తాయా? అదెలా సాధ్యం.. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటీ?
మొత్తంగా ఈ విమాన ప్రమాదానికి పక్షల గుంపు ఢీ కొట్టడమే కారణంగా భావిస్తున్నారు. గాల్లో పక్షులు బలంగా ఢీ కొట్టడం (Birds Clashes) వల్లే ల్యాండింగ్ గేర్ తెరుచుకుని ఉండదని అంచనా వేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ అధికారులు సైతం.. రన్ వే పై పక్షుల దాడులు జరిగే అవకాశాలున్నట్లు సిగ్నల్ ఇచ్చినట్లు తెలుపుతున్నారు.