Akhanda2 massive update : కొన్ని కాంబినేషన్స్ పైన ఉండే హైప్ మామూలుది కాదు. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామందికి బోయపాటి పేరు చెప్తే ముందుగా గుర్తొచ్చే సినిమాలు బాలకృష్ణతో చేసేవే. భద్ర లాంటి అద్భుతమైన సక్సెస్ఫుల్ సినిమా చేసినా కూడా బాలకృష్ణతో చేసిన సినిమాలు గుర్తు రావడానికి కారణం, వాటిని అంత పవర్ ఫుల్ గా బోయపాటి శ్రీను డిజైన్ చేయడం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా సినిమా చాలా ఏళ్లు తర్వాత బాలకృష్ణకు సక్సెస్ తీసుకొచ్చింది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ సినిమాలు వచ్చాయి.
బాలకృష్ణని ఎలా చూపించాలో బోయపాటికి తెలుసు
ప్రతి దర్శకుడు కి ఒక కొత్త కథను చెప్పాలి అని ఆలోచన ఎలా ఉంటుందో, తన అభిమాన హీరోని ఎలా చూపించాలి అనే ఆలోచన ఉండటం కూడా సహజం. అందుకే చాలామంది దర్శకులు తమ అభిమాన హీరోలతో సినిమాలు చేసినప్పుడు మంచి సక్సెస్ అందుకుంటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ రూపంలో ఆ స్థాయి హిట్ ఇచ్చాడు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ ని అభిమానించడం. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే సింహా సినిమాలో తన పర్ఫామెన్స్ ని ఎవరు మర్చిపోలేరు. ఒకవైపు ప్రొఫెసర్ గా మరోవైపు డాక్టర్ గా చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు బోయపాటి శ్రీను.
అఖండ టు మాసివ్ అప్డేట్
సింహ సినిమా తర్వాత వచ్చిన లెజెండ్ సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఎంతమంది దర్శకులతో సినిమా చేసినా కూడా బోయపాటి శ్రీను తో బాలకృష్ణ సినిమా చేయడం వేరు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా నెక్స్ట్ లెవెల్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాకి తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ థియటర్ ను షేక్ చేసింది. కొన్నిచోట్ల బాక్సులు కూడా పగిలిపోయాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో అఖండ 2 సినిమా వస్తున్నట్లు ఇదివరకే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన మాసివ్ అప్డేట్ రేపు రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. రేపు 10 గంటల 54 నిమిషాలకు తాండవం మొదలుకానున్నది తెలిపారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.