BigTV English

CSK VS RCB: బెంగళూరు ను దారుణంగా ఆడుకుంటున్న చెన్నై.. వచ్చే ఏడాది మీకు ఖైదీల బస్సు పక్కా!

CSK VS RCB:  బెంగళూరు ను దారుణంగా ఆడుకుంటున్న చెన్నై.. వచ్చే ఏడాది మీకు ఖైదీల బస్సు  పక్కా!

CSK VS RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు జూన్ 03న జరిగిన ఫైనల్ పంజాబ్ కింగ్స్ జట్టు పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. నువ్వా..? నేనా..? అని హోరా హోరీగా జరిగిన పోరులో చివరికీ ఆర్సీబీ టైటిల్ ని తొలిసారిగా ముద్దాడింది. 18 ఏళ్ల తరువాత తొలిసారి టైటిల్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు.   అయితే ఆర్సీబీ జట్టు సన్మానానికి ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడం, జనం నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట లో వైదేహి ఆసుపత్రికి 16 మందిని తీసుకురాగా.. వీరిలో నలుగురు ఊపిరి ఆడక  చనిపోయారు. మిగతా మందికి చికిత్స అందిస్తున్నారు. 


Also Read :  Shreyas Iyer : సర్పంచ్ సాబ్ క్రేజ్ మామూలుగా లేదుగా.. పంజాబ్ కార్లపై అయ్యర్ ఫోటోలు

ఇదిలా ఉంటే.. బెంగళూరును దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు. లీగ్ దశలో చెన్నై పై ఆర్సీబీ అభిమానులు ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఆర్సీబీ బుడ్డోడు ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని ము**డ్డీతో తుడుచుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు ఓ థియేటర్ లో చెన్నై సూపర్ కింగ్స్.. బెంగళూరు అభిమానులు కొట్టుకున్నారు. ఇలా చాలా సందర్బాల్లో చెన్నై వర్సెస్ బెంగళూరు క్రికెట్ అభిమానుల మధ్య వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో బెంగళూరు ను దారుణంగా ఆడుకుంటున్నారు చెన్నై అభిమానులు. మరోవైపు వచ్చే ఏడాది మీకు ఖైదీల బస్సు పక్కా.. అంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇక దీనిపై బీసీసీఐ కూడా కీలక ప్రకటన చేసింది.


బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. “మేము మౌనంగా చూస్తూ ఉండలేము. ఏదో ఒకటి చేయాలి. ఇది ఆర్సీబీ కి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం. కానీ ఈ దేశంలో క్రికెట్ వ్యవహారాలకు మేము బాధ్యత తీసుకోవాల్సిందే. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ ఘటన పై పలువురు సీనియర్ క్రికెటర్లు సైతం స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటికే బెంగళూరు నగర కమిషనర్ బి.దయానంద్ ను సస్పెండ్ చేయగా.. సీఎం సిద్ద రామయ్య రాజకీయ కార్యదర్శిని విధుల నుంచి తొలగించారు. మరికొందరూ ఉన్నతాధికారులపై  సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనకు సంబంధించిన ఆర్సీబీ ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెతో పాటు డీఎన్ఏ మేనేజ్ మెంట్ ప్రతినిధులు సునీల్ మ్యాథ్యూ, కిరణ్, సుమంత్ లను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ ఘటన వల్ల ఇంకా ముందు ముందు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఒక గుణపాఠం అయిందని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. మరీ ఆర్సీబీ టైటిల్ సాధించిన.. సాధించకపోయినా ట్రోలింగ్స్ కి గురికావడంలో మాత్రం ముందుండటం విశేషం. 

https://www.facebook.com/share/p/1EScMxRkPs/

Tags

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×