Hyderabad : జూన్ 7, ఆదివారం. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ. శ్వాసకోశ సమస్యలకు ఆ మందు అద్భుతంగా పని చేస్తుందని ప్రజల నమ్మకం. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చేప మందు కోసం పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంటారు. అందుకు తగ్గట్టే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మహిళలు, పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వసతులు కల్పించింది. టైమింగ్ ప్రకారం స్లాట్ బుకింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. తొక్కిసలాట జరగకుండా.. 12 విభాగాల సిబ్బందిని నియమించి రక్షణ కల్పిస్తున్నారు.
వచ్చిన ప్రతి ఒక్కరికీ చేప మందు అందేలా చూస్తామన్నారు బత్తిని కుటుంబ సభ్యులు. ఆస్తమా రోగులకు ఔషధం పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబానికి అవసరమైన సొర చేపలను సరఫరా చేయడానికి మత్స్య శాఖ ఏర్పాట్లు చేసింది. మరోవైపు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది.
చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా జూన్ 7 నుంచి 9 వరకు నాంపల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పలు చోట్ల వాహనాలను దారి మళ్లించనున్నారు. ఆ మూడు రోజులు రద్దీగా ఉండే ప్రాంతాలు, దారి మళ్లించే ఏరియాలో ఏవో తెలుపుతూ ఓ లిస్ట్ రిలీజ్ చేశారు.
ట్రాఫిక్ పోలీసుల సూచనలు ఇవే :
⦿ నాంపల్లి వైపు నుంచి చేపల ప్రసాదం కోసం కార్లలో వచ్చే సందర్శకులు తమ వాహనాలను గృహకల్ప, గగన్ విహార్ లేదా చంద్ర విహార్ దగ్గర పార్క్ చేసి, ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్ నంబర్ 2కి కాలినడకన రావాల్సి ఉంటుంది.
⦿ MJ మార్కెట్ నుంచి బస్సులో వచ్చే సందర్శకులు గాంధీభవన్ బస్ స్టాప్ దగ్గర దిగాలి. నాంపల్లి నుండి వచ్చే వారు గృహకల్ప బస్ స్టాప్ వద్ద దిగి, ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్ నంబర్ 2కి వెళ్లాలి.
⦿ MJ మార్కెట్ నుండి వచ్చే VIP కార్ పాస్ ఉన్నవారు.. అజంతా గేట్, గాంధీ భవన్ ద్వారా గేట్ నంబర్ 1 మరియు CWC గేట్ (VIP ఎంట్రీ) వైపు లెఫ్ట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది.
⦿ MJ మార్కెట్ నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు మనోరంజన్ కాంప్లెక్స్ దగ్గర పార్క్ చేయాలి. నాంపల్లి నుండి వచ్చే వారు గృహకల్ప, BJP కార్యాలయం మధ్య రోడ్డుకు ఎడమ వైపున పార్క్ చేయాలి.
⦿ ఆటోరిక్షా డ్రాప్-ఆఫ్ పాయింట్లు : షేజాన్ హోటల్, భవానీ వైన్స్, జువెనైల్ కోర్టు మరియు ఎక్సైజ్ కార్యాలయం. రోడ్డుకు ఎడమ వైపున ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించారు.
⦿ ఎం.జె. బ్రిడ్జి మరియు బేగమ్ బజార్ చత్రి నుండి నాంపల్లి వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను అలాస్కా వద్ద దారుస్సలాం, ఏక్ మినార్ మొదలైన వాటి వైపు మళ్లిస్తారు.
⦿ SA బజార్ మసీదు నుంచి MJ మార్కెట్ జంక్షన్ ద్వారా గాంధీ భవన్ వైపు..
⦿ పుత్లిబౌలి నుంచి MJ మార్కెట్ జంక్షన్ ద్వారా గాంధీభవన్ వైపు..
⦿ యూసుఫైన్ కంపెనీ to MJ మార్కెట్ జంక్షన్ ద్వారా గాంధీ భవన్ వైపు..
⦿ అలస్కా జంక్షన్ నుంచి మలకుంట జంక్షన్ వైపు..
⦿ SA బజార్ మసీదు, పుత్లిబౌలి నుంచి వచ్చే భారీ వాహనాలను MJ మార్కెట్ జంక్షన్ దగ్గర.. GPO జంక్షన్ ద్వారా నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లిస్తారు.
⦿ రవీంద్ర భారతి నుంచి వచ్చే భారీ వాహనాలను.. AR పెట్రోల్ పంప్ దగ్గర BJR సర్కిల్ వైపు డైవర్ట్ చేస్తారు.
⦿ GPO, అబిడ్స్ రోడ్డు నుంచి వచ్చే భారీ వాహనాలను.. MJ మార్కెట్ జంక్షన్ వద్ద SA బజార్ మసీదు వైపు మళ్లిస్తారు.
⦿ అత్యవసర పరిస్థితుల్లో కానీ, ప్రయాణ సహాయం కోసం కానీ.. ఫోన్ చేయాల్సిన ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్–9010203626.