BigTV English

Boyapati – Balayya: బాలయ్య – బోయపాటి కాంబో రిపీట్ .. అదే టైటిల్ ఫిక్స్..?

Boyapati – Balayya: బాలయ్య – బోయపాటి కాంబో రిపీట్ .. అదే టైటిల్ ఫిక్స్..?

Boyapati – Balayya : టాలీవుడ్ యాక్షన్ హీరో నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఎంత పెద్ద క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబోలో చివరగా వచ్చిన అఖండ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేశారు ఈ ద్వయం. అందుకే ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో అభిమానుల ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తాడు. బోయపాటి అఖండ 2 ను చూపిస్తారా అన్నది తెలియలేదు కానీ ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఈరోజు రామా నాయుడు స్టూడియోలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ టైటిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.


బాలయ్య – బోయపాటి కాంబోలో రాబోతున్న నాలుగో చిత్రమిది.. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఈరోజు ఉదయం జరగనుంది. రామానాయుడు స్టూడియోలో చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. రామ్ అచంట , గోపీ అచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి బాలయ్య చిన్న కూతురు ఎం.తేజస్విని నందమూరి సమర్పకురాలుగా వ్యవహరిస్తోంది. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు మూడు సినిమాలు సింహ, లెజెండ్, అఖండ వంటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. మూడు కూడా అభిమానులలో హైప్ పెంచడమే కాకుండా అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

బాలయ్య – బోయపాటి సినిమా టైటిల్..


బాలయ్య – బోయపాటి కాంబినేషన్ వచ్చిన మూడు సూపర్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న నాలుగో మూవీ.. ‘అఖండ’ కథకు ఇది కొనసాగింపు. అయితే బోయపాటి మాత్రం ఈ సినిమాకు ఓ కొత్త టైటిల్ ప్రకటించ బోతున్నాడు. రేపు హైదరాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అలాగే మోషన్ పోస్టర్ కూడా విడుదల చేస్తారు. ఈ చిత్రానికి ‘తాండవం’ అనే పేరు పెట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ‘అఖండ’లో మాస్, యాక్షన్‌, హీరోయిజం ఇవన్నీ బాగా పండాయి. దానికి తోడు హిందుత్వం అనే ఎలిమెంట్ కూడా తోడైంది. దేవాలయాల పరిరక్షణ, వాటి విశిష్టత గురించి ‘అఖండ’లో చెప్పారు. ఇప్పుడు ఆ పాయింట్ తో ఈ సినిమా స్టోరీ ఉండబోతుందనే టాక్ వినిపిస్తుంది. మరి బోయపాటి ఎలాంటి స్టోరీతో సినిమా చేస్తాడో చూడాలి.. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. భారీ బడ్జెట్ తో పాటు సరికొత్త కథ తో భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎటువంటి విజయం అందుకుంటుందో చూడాలి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×