Bellamkonda Sai Srinivas : ఏ రంగంలోనైనా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే టాలెంట్ అనేది ప్రత్యేకంగా అవసరం. అయితే అదే రంగంలో ఎక్కువ కాలం నిలబడాలి అంటే క్రమశిక్షణ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ చాలామంది స్టార్ హీరోల కొడుకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని వరుస సినిమాలు చేస్తున్నారు అంటే వాళ్లకి డిస్ప్లేన్ కూడా తోడైంది అని చెప్పాలి. రామ్ చరణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మా నాన్నగారు నాకు ఇదే నేర్పారు అంటూ చెప్పుకొచ్చారు. మొదట్లో కొంచెం దూకుడు చూపించిన చరణ్ తర్వాత తర్వాత తనను తాను మార్చుకొని చాలామందికి ఇష్టంగా మారిపోయాడు. ఒకప్పుడు మీడియా రాతలకు ఆన్ స్టేజ్ పై వార్నింగ్ ఇచ్చిన చరణ్ ఇప్పుడు ఏ వార్త వచ్చినా పెద్దగా పట్టించుకోవడం మానేశాడు.
సాయి శ్రీనివాస్ బాలీవుడ్ క్రేజ్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న హీరోలలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. అల్లుడు శీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ తన కెరియర్లో ఎన్నో ప్రత్యేకమైన సినిమాలను ఎంచుకున్నారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా కూడా, యూట్యూబ్లో ఈ సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నార్త్ ఆడియన్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలను విపరీతంగా చూస్తారు. ఆ ధైర్యంతోనే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయినా చత్రపతిని హిందీలో రీమేక్ చేశారు. అయితే ఆ సినిమాకి అక్కడ సరైన ఆదరణ లభించలేదు. ఎప్పుడూ మొదలైన సినిమా కొన్ని కారణాల వల్ల లేట్ కావడంతో సరైన ఆదరణ దక్కలేదు.
టైం కి షూటింగ్ కి వెళ్ళాలి
ఇక ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విజయ్ దర్శకత్వంలో భైరవం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు సాయి శ్రీనివాస్. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తను చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ సినిమాలు చూసి ఆశ్చర్యపోయేవాడిని అంటూ తెలిపారు. ఆయనలా యాక్టింగ్ చేయడం అసాధ్యం. అందుకనే నేను కమర్షియల్ సినిమాలు ఎంచుకుంటాను.
ప్రతి యాక్టర్ సక్సెస్ వెనక ఒక కష్టం ఉంటుంది. నేను ఆ కష్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రొడ్యూసర్ కి ఫెవర్ గా ఉంటూ కరెక్ట్ టైం లో షూటింగ్ కి వెళ్తే, మనకు మంచి అవకాశాలు వస్తాయి అంటూ చెప్పుకొచ్చారు. చాలామంది హీరోలు పేరు వచ్చిన తర్వాత కరెక్ట్ టైంకి షూటింగ్ కి రారు అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ల డిమాండ్స్ వాళ్లకి ఉంటాయి. ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా ఉండే హీరోలు ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ.
Also Read : Sandeep Reddy Vanga : గట్స్ ఉన్న ఫిలిం మేకర్ అని మరోసారి రుజువు చేశాడు