BigTV English

Sandeep Reddy Vanga : గట్స్ ఉన్న ఫిలిం మేకర్ అని మరోసారి రుజువు చేశాడు

Sandeep Reddy Vanga : గట్స్ ఉన్న ఫిలిం మేకర్ అని మరోసారి రుజువు చేశాడు

Sandeep Reddy Vanga : కేవలం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియాలోనే ఒక బ్రాండ్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. మనసు మాట వినదు అనే సినిమాకి అప్రెంటిస్ గా జాయిన్ అయిన సందీప్ రెడ్డివంగా. ఆ తర్వాత కొన్నేళ్లపాటు సినిమాలు వదిలేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అక్కడ ఫిలిం స్కూల్లో చదువుకున్న సందీప్ రెడ్డి వంగ తెలుగులో నాగర్జున నటించిన కేడి అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. ఆ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగా ఇంకా ఎవరి దగ్గర పని చేయలేదు. దర్శకుడుగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తాను అనుకున్న కాదని అనుకున్నట్లుగానే తీయాలి అని పట్టు పట్టుకుని మరి కూర్చున్నాడు. ఈ తరుణంలో చాలామంది ప్రొడ్యూసర్స్ అతని కథను రిజెక్ట్ చేశారు. ఇక వీళ్ళను నమ్ముకుని లాభం లేదు అని ఫిక్స్ అయిపోయి, తమ ఇంట్లో వాళ్ళనే నిర్మాతలుగా మార్చేశాడు. అర్జున్ రెడ్డి అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది.


మొదటి సినిమాతోనే బ్రాండ్ 

అర్జున్ రెడ్డి సినిమా వినడానికి మామూలు కథ, పెద్దగా కొత్తగా కూడా ఉండదు కానీ సందీప్ రెడ్డి వంగ ఆ కథను చూపించిన విధానం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఒక ఇంటెన్స్ తో ఆ సినిమాను తెరకెక్కించాడు సందీప్ రెడ్డి. మొదటి పోస్టర్ విడుదలైనప్పటి నుంచి అనేక వివాదాలకు సినిమా దారి తీసింది. అయితే తన సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచే సందీప్ రెడ్డివంగా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించేవాడు. కొంతమంది దర్శకులు లాగా ఇలానే మాట్లాడుతాడులే అని అందరూ అనుకున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగా తన మొదటి సినిమాతోనే అందరికీ సమాధానం చెప్పాడు. సినిమా జరిగే ప్రాసెస్ లో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నాడు.


సందీప్ రెడ్డి గట్స్

సందీప్ రెడ్డి కు తనలో టాలెంట్ ఉంది అని తెలుసు కాబట్టి, ఎక్కడ తగ్గడం లేదు. తెలుగులో మీ సినిమాలను బ్యాన్ చేస్తే ఏం చేస్తారు అని అడిగితే, హిందీలో చేస్తా, మరాఠీలో చేస్తా, లేదంటే హాలీవుడ్ కి వెళ్ళిపోతా అంటూ చెప్పుకొచ్చాడు. అలానే మ్యూజిక్ డైరెక్టర్ రధన్ తనను ఎంతలా ఇబ్బంది పెట్టాడో ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. బాలీవుడ్ మీడియా పర్సన్ అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతుంటే వినట్లేదు అని అందరి ముందు అతన్ని తిరిగి ప్రశ్నించాడు. తన సినిమాని ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరిని గట్టిగా తగులుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొనే తప్పుకుంటున్నారు అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తనని తప్పించి త్రిప్తి డిమ్రి ను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. మరోసారి తన గట్స్ ఏంటో నిరూపించాడు.

Also Read : Manchu Manoj: తన అన్నయ్య విష్ణు కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×