BigTV English

neha shetty – Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా ‘టిల్లు’ గాని హీరోయిన్..!

neha shetty – Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా ‘టిల్లు’ గాని హీరోయిన్..!

neha shetty – Pragya Jaiswal – Bellamkonda Sreenivas: తొలి మూవీ ‘అల్లుడు శ్రీను’తో సూపర్ హిట్ అందుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అప్పటి నుంచి వరుసపెట్టి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, పూజాహెగ్డే వంటి స్టార్ హీరోయిన్లతో సినమాలు చేశాడు. ఇక ఎన్ని సినిమాలు తీసినా.. స్టార్ హీరో హోదా మాత్రం అందుకోలేకపోయాడు. అందుకు కారణం ఈ హీరో నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడమే.


ఇక తెలుగులో సినిమాలు చేస్తూనే.. నార్త్‌లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ పాపులారిటీతోనే ఇటీవల వి.వి వినాయక్ దర్శకత్వంలో ఓ మూవీ చేశాడు. తెలుగులో ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ మూవీని రీమెక్ చేసి హిందీలో అదే పేరుతో రిలీజ్ చేశారు.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా పరాజయంపాలైంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెల్లంకొండకు నిరాశే మిగిలింది.


ఈ మూవీ తర్వాత మళ్లీ ఈ హీరో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తెలుగులో ఓ మూవీ చేస్తున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ఇటీవల టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి గానూ ‘టైసన్ నాయుడు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. శరవేగంగా షూటింగ్ పూర్తి జరుపుకుంటున్న ఈ మూవీ.. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జోడీగా ఓ హీరోయిన్‌ను మేకర్స్ ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ‘డీజే టిల్లు’తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ముద్దుగుమ్మ నేహా శెట్టి ‘టైసన్ నాయుడు’ మూవీలో బెల్లంకొండకు జోడీగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీలో శ్రీనివాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా నటి ప్రగ్యా జైస్వాల్ ఇందులో కీలక పాత్ర పోషించనుంది. బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీని రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related News

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×